»   » అల్లరి నరేష్ 'మడత కాజా' స్టోరీ లైన్

అల్లరి నరేష్ 'మడత కాజా' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్‌,స్నేహ ఉల్లాల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'మడత కాజా'. సీతారామరాజు దంతులూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం స్టోరీ లైన్ తమాషాగా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఎవరినైనా మాటలతో మడతెట్టేసే అల్లరి కుర్రాడప. విశాఖపట్నంలో చిల్లర వేషాలతో కాలక్షేపం చేసే అతను స్నేహ ఉల్లాల్ కోసం హైదరాబాద్‌ రావలసి వస్తుంది.అక్కడ నుంచి కథ మలుపుతిరిగుతుంది. హైదరాబాద్ వచ్చిన నరేష్ ఏం సాధించాడు? అన్న కోణంలో కథ కామిడీగా సాగుతుంది. ఇక ఈ చిత్రం లోగోను సోమవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎల్‌.దామోదరప్రసాద్‌ మాట్లాడుతూ ''నరేష్‌ వినోదాన్ని కొత్త తరహాలో ఆవిష్కరించే చిత్రమిది. త్వరలో బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. నెలాఖరున పాటల్ని, వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. సుబ్బరాజు, జయప్రకాష్ ‌రెడ్డి, ఆహుతి ప్రసాద్‌, ఆశీష్‌ విద్యార్థి, ధర్మవరపు, చలపతిరావు, ఎమ్మెస్‌ నారాయణ, జీవా వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. మాటలు: వేగ్నేశ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేకానంద కూచిబొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: అడుసుమిల్లి విజయ్‌కుమార్‌.

English summary
Ala Modalaindi's producer Damodar Reddy is planning his next film with Allari Naresh. Seeta Rama Raju direct this film. The director is vastly experienced in the film industry and has good relations with many heroes. His experience and Allari Naresh factor could prove handy for Damodar Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu