»   » ‘సాప్ట్ వేర్ సుబ్బారావు’ కడుపుబ్బా నవ్విస్తాడట...!?

‘సాప్ట్ వేర్ సుబ్బారావు’ కడుపుబ్బా నవ్విస్తాడట...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో 'కత్తి కాంతారావు"గా కనిపించి 'సరదాగా కాసేపు" నవ్వించనున్న అల్లరి నరేష్ ఆపై 'సాప్ట్ వేర్ సుబ్బారావు"గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 'బిందాస్" బ్యానర్ ఎకె ఎంటర్ టైన్మెంట్స్ లో వీరభద్రం చౌదరి దర్శకుడిగా రూపొందనున్న ఈ అల్లరి నరేష్ తదుపరి చిత్రానికి మొదట 'సిల్లీ ఫెలో" అనే టైటిల్ ని అనుకున్నప్పటికీ ఇప్పుడా పేరుని పక్కన పెట్టేశారు..కొత్త పేరును పెట్టేందుకై పలు టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.

అందులో 'అహ నా పెళ్ళంట", 'సుబ్బుకి కోపమొచ్చింది", 'సాప్ట్ వేర్ సుబ్బారావు" వంటి కొన్ని పేర్లను అనుకొని అభిప్రాయ సేకరణకు దిగిన ఈ యూనిట్ ని సాప్ట్ వేర్ సుబ్బారావే స్ట్రాంగ్ మెజారిటీతో మెప్పించాడని తెలిసింది. ఆల్ రెడీ అల్లరి నరేష్ చేసిన హిట్ సినిమాలు అత్తిలి సత్తిబాబు, బెండు అప్పారావ్, బెట్టింగ్ బంగార్రాజు చిత్రాల టైటిల్స్ లా 'సాప్ట్ వేర్ సుబ్బారావు" కూడా చాలా క్యాచీగా వుందని దానికి ఎక్కువ డిమాండ్, స్పందన సర్వత్రా వ్యక్తమయిందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu