»   » ఈవివి సినిమా: ‘బందిపోటు’గా అల్లరి నరేష్

ఈవివి సినిమా: ‘బందిపోటు’గా అల్లరి నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఇ.వి.వి సత్యనారాయణ స్థాపించిన 'ఇ.వి.వి సినిమా' సంస్థ బాధ్యతలను ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ స్వీకరించారు. ఆయన సారథ్యంలో 'ఇ.వి.వి సినిమా' సంస్థ నుండి వస్తున్న తాజా చిత్రం వివరాలు రాజేష్ వెల్లడించారు.

ఇటీవల 'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో...అల్లరి నరేష్ హీరోగా 'బంధిపోటు' చిత్రం రూపొందించేందుకు ఆర్యన్ రాజేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఇ.వి.వి జయంతి సందర్భంగా జూన్ 10న ఈ చిత్రం ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ...'నాన్నగారి తదనంతరం 'ఇవివి సినిమా' బ్యానర్ బాధ్యతలను చేపడుతూ...ఇకపై వరుస చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా 'బందిపోటు' చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

ఆర్యన్ రాజేష్

ఆర్యన్ రాజేష్

ఈ చిత్రం ద్వారా ఇవివి పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మారుతున్నారు. గతంలో ఆర్యన్ రాజేష్ ‘హాయ్' సినిమాతో పాటు పలు చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

అల్లరి నరేష్

అల్లరి నరేష్

అల్లరి నరేష్ ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత జూన్ 10 నుండి జరిగే ‘బంధిపోటు' సినిమా షూటింగులో పాల్గొంటాడు.

మోహన కృష్ణ ఇంద్రగంటి

మోహన కృష్ణ ఇంద్రగంటి

ఇటీవల ‘అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘బందిపోటు' చిత్రం తెరకెక్కబోతోంది.

కామెడీ ఎంటర్టెనర్

కామెడీ ఎంటర్టెనర్

ఈచిత్రాన్ని పూర్తి వినోదత్మక చిత్రంగా, కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన నటీనటులు మరి సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అల్లరి నరేష్ మార్కు కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

English summary
The prestigious EVV Cinema banner was established by renowned director EVV Satyanarayana in his hey days. Now after his demise, his elder son and actor Arjan Rajesh has decided to head the banner and produce a new film titled Bandipotu. will play the lead role in this film, which will be directed by Mohana Krishna Indraganti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu