»   » 'నాన్నకు ప్రేమతో' నిర్మాత, దెయ్యం కథతో సినిమా

'నాన్నకు ప్రేమతో' నిర్మాత, దెయ్యం కథతో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్. అప్పుడప్పుడూ ట్రాక్ తప్పి కామెడీ ని ప్రక్కన పెట్టినప్పుడల్లా భాక్సాఫీస్ జెల్లకాయి ఇచ్చి సరిచేస్తూ వస్తోంది. అయితే ఎందుకనో గత కొంత కాలంగా అల్లరి నరేష్ సినిమాలు క్లిక్ అవ్వటంలేదు. వచ్చిన ప్రతీ సినిమా వారం కూడా ధియేటర్లో ఉండటానికి ఇష్టపడటం లేదు.

ఈ నేపధ్యంలో నరేష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తెలుగులో వర్కవుట్ అవుతున్న హర్రర్ కామెడీకు శ్రీకారం చుడుతున్నాడు. ఇన్నాళ్లు అందరూ చేస్తున్నారు కదా మనం కూడా ఎందుకు చేయటం అనుకున్నాడో ఏమో కానీ హర్రర్ కామెడీ జోలికి వెళ్లలేదు. కానీ తనకు గతంలో సీమటపాకాయ్ అంటూ హిట్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి అదే తరహా కథ తెచ్చేసరికి కాదనలేకపోయాడు.

Allari Naresh next Maa Intlo Undi Deyyam Nakenduku Bhayam

అల్లరి నరేష్‌ హీరోగా 'మా ఇంట్లో ఉంది దయ్యం.. నాకెందుకు భయం' అనే పేరుతో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. కానిడీకి పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో నిర్మించిన ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

అల్లరి నరేష్‌ సినీ కెరీర్‌ ప్రారంభించి నేటితో 14 ఏళ్లు పూరైంది. 'అల్లరి' చిత్రంతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన నరేష్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా గుర్తు ఇవాళ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనను ఆధరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తివివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

English summary
Allari Naresh is doing a comedy film in the direction of hit maker G Nageshwara Reddy. The title is - Maa Intlo Undi Deyyam Nakenduku Bhayam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu