twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియదర్శన్ దర్శకత్వంలో అల్లరి నరేష్

    By Srikanya
    |

    కళాకారుడికి భాషాభేదాలు ఉండకూడదు. అయితే తెలుగులో ఏడాదికి సరాసరి నాలుగైదు చిత్రాలు చేస్తూ ఇక్కడే బిజీగా ఉన్నందువల్ల ఇతర భాషల గురించి ఆలోచించలేదు.ఇక హిందీలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో నేను చేస్తున్న చిత్రం పునర్నర్మితం కాబోతోంది. అందులో నటించమని అడిగారు కానీ ఇంకా నేను ఓ నిర్ణయానికి రాలేదు అంటున్నారు అల్లరి నరేష్. ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం పోరాళి తెలుగు వెర్షన్ సంఘర్షణ తెలుగులో త్వరలో విడుదల కాబోతున్న సందర్భాన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. అలాగే 'సంఘర్షణ'చిత్రం గురించి చెపుతూ..గమ్మతైన కథ.

    హాస్యానికి కూడా ప్రాధాన్యం ఉంది. జీవన సమరంలో నలుగురు ఎలాంటి సంఘర్షణ పడ్డారన్నదే ప్రధానాంశం. అందుకే క్రేజ్‌ కోసం ఏదోఒక టైటిల్‌ పెట్టకుండా కథకు అన్నివిధాలా సరిపోయే 'సంఘర్షణ'నే టైటిల్‌గా పెట్టడం జరిగింది. తమిళంలో పోరాలి అంటే యోధుడు (వారియర్‌). నిత్య జీవితానికి దగ్గరగా మానవ సంబంధాలకు, ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. సమాజంలో మనకు ఎదురయ్యే పాత్రలే చిత్రంలో కనిపిస్తాయి. ఇక రెండవభాగంలో వచ్చే పదినిమిషాల ఘట్టాలు ప్రాణంగా నిలుస్తాయి. సినిమా మొత్తంమీద 17 సార్లు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాను చూసినట్లు కాకుండా జీవితాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది అన్నారు.

    English summary
    If everything goes well, Allari Naresh might make his debut in Bollywood ... Telugu as Sangharshana, would be remade in Hindi by Priyadarshan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X