»   » అల్లరి నరేష్ షాకింగ్ లుక్, భూమిక హీరోయిన్

అల్లరి నరేష్ షాకింగ్ లుక్, భూమిక హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ ప్రస్తుతం రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 'లడ్డూ బాబు' అనే టైటిల్ ఈచిత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది. టైటిల్‌కు తగిన విధంగానే ఈచిత్రంలో నరేష్ లావుగా, ఓల్డ్ లుక్‌తో కనిపించనున్నాడట.

అల్లరి నరేష్ విషయంలో ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని షాకింగ్ లుక్ కోసం...ప్రత్యేకంగా లండన్ నుంచి మేకప్ నిపుణులను రప్పించారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో భూమిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది మామూలు సినిమాల్లా కాకుండా వెరైటీగా, కామెడీ పండించే విధంగా ఉండబోతోందట.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న షూటింగ్ ఈ నెల 20 వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్రిపురనేని రాజేంద్ర నిర్మిస్తున్నారు. చక్రి స్వరాలు అందిస్తున్నారు. రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

English summary
Allari Naresh is currently working for a new project in Ravi Babu’s direction. Bhumika will be seen as the heroine. This comedy entertainer is being produced by Tripuraneni Rajendra. Shooting is currently going on at Ramoji Film City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu