For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నో సెంటిమెంట్..ఓన్లీ కామెడీ( 'బ్రదరాఫ్‌ బొమ్మాళీ' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : వీడు తేడా చిత్రంతో దర్శకుడుగా మారిన చిన్ని కృష్ణ మరో కామెడీతో ఈ రోజు మనముందుకు వస్తున్నారు. రెగ్యులర్ గా చూపించే అన్న చెల్లెళ్ళ కథని పూర్తి కామెడీ గా ట్రీట్ చేసి అల్లరి నరేష్ తో తెరకెక్కించాడు. వరస ఫ్లాఫులతో సతమతమవుతున్న అల్లరి నరేష్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా నరేష్‌కి మంచి పేరుంది. ఆయన సినిమా అంటే ప్రతీ రీలూ నవ్వుల జల్లులే. ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన వినోదం అందిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన 'బ్రదరాఫ్‌ బొమ్మాళీ' ఈ శుక్రవారం విడుదల కానుంది.

  కథలో...
  అల్లరి నరేష్ పేరు రామకృష్ణ. ఈ సినిమాలో అసలు అబద్ధాలు ఆడడు. అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుందేమోననే భయంతో. మైండ్‌తో ఆలోచిస్తుంటాడు. అతనికో కవల సోదరి(కార్తిక) పేరు లక్ష్మి. కానీ లక్కీ అని చెప్పుకుంటుంది. నరేష్ కు ఏమైనా ఆపద వస్తే లక్కీ కాపాడుతుంటుంది. తను మ్యాన్‌ హ్యాండ్లింగ్‌ చేస్తుంటుంది. బుర్రతో కాకుండా కేవలం ఆవేశంతో ప్రవర్తిస్తుంటుంది. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియని తత్వం తనది. ఇందులో అల్లరి నరేష్, మోనాల్‌ ప్రేమించుకుంటారు. నరేష్ పెళ్లికన్నా ముందు కార్తికకి పెళ్లి చేయాలన్నది ఇంట్లో వాళ్లు పెట్టిన షరతు. కార్తీక ను ఇష్టపడే హర్షవర్ధన్‌ కుటుంబాన్ని మెప్పించి ఎలా పెళ్లి చేశారు అనేది కీలకం. హర్షవర్ధన్ కుటుంబం ఎలాంటిది..ఎలా ఒప్పించారు...అనేది కామెడీతో నడుస్తూంటుంది.

  అల్లరి నరేష్ మాట్లాడుతూ..''అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో చాలా కథలొచ్చాయి. అయితే 'బ్రదరాఫ్‌ బొమ్మాళీ' మాత్రం ప్రత్యేకం. సాధారణంగా చెల్లెమ్మలు సాత్వికంగా ఉంటారు. మనింట్లో ఆడపిల్ల బయటకు వెళ్తే 'జాగ్రత్తగా వెళ్లిరా' అని సుద్దులు చెబుతాం. కానీ మా సినిమాలో చెల్లెలు మాత్రం రివర్స్‌. తానో లేడీ రౌడీ. చెల్లాయి బయటకు వెళ్తే ఎవరికి ఎలాంటి ప్రమాదమో అని భయపడే అన్నయ్య నేను. తాను చేసే రౌడీ పనులు, దాంతో పండే వినోదం ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతీ ఒక్కరినీ కొట్టడమే తన పని. ఆఖరికి నేనూ ఆమె చేతిలో చెంపదెబ్బలు తిన్నా. శ్రీనివాసరెడ్డిని కనీసం వందసార్లయినా కొట్టుంటుంది (నవ్వుతూ). ప్రేమ్‌రక్షిత్‌తో పోరాడి మరీ.. 'ఫ్లోర్‌' మూమెంట్స్‌ వేసింది. ఒక విధంగా డాన్స్‌లో నాకు పోటీ వచ్చేసింది'' అంటున్నారు అల్లరి నరేష్‌.

  అలాగే .. ''ఈ సినిమాలో నేనూ, కార్తీక ఇద్దరం హీరోలమే. తన పాత్రని అంత బాగా తీర్చిదిద్దారు. అయితే కథని నడిపించేది నేనే. బ్రహ్మానందం కోన వెంకట్‌గా కనిపిస్తారు. నిజానికి ఈ సినిమాలో ఆయన పేరు.. కోలా. 'కోలా అంటే ఎవరికి అర్థం అవుతుంది? కోన వెంకట్‌ అని పెట్టేద్దాం' అని బ్రహ్మానందం సలహా ఇచ్చారు. విలన్స్ నూ వినోదం పంచిపెట్టాం. ఈ సినిమాలో అదే ప్రత్యేకం''. అని చెప్పుకొచ్చారు.

  Allari Naresh's Brother of Bommali preview

  చిత్రం : ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి'
  బ్యానర్ : సిరి సినిమా
  నటీనటులు: నరేశ్‌ , మోనాల్‌ గజ్జర్‌, కార్తీక, హర్షవర్థన్‌ రాణే, భానుశ్రీ మెహ్రా, బ్రహ్మానందం, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడు, ఎల్బీ శ్రీరామ్‌, జీవా, కెల్లీ డోర్జీ, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, సుధ, సురేఖావాణి తదితరుల.
  పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, శ్రీమణి,
  స్టంట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌,
  కూర్పు: గౌతంరాజు,
  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.
  కెమెరా: విజయకుమార్‌ అడుసుమిల్లి,
  సంగీతం: శేఖర్‌చంద్ర
  సమర్పణ: ఇ.వి.వి. సత్యనారాయణ
  నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
  కథ: విక్రమ్‌ రాజ్‌,
  స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బి. చిన్ని కృష్ణ
  విడుదల తేదీ : 07-11-2014.

  English summary
  Brother Of Bommali is comedy entertainer movie in which, Allari Naresh, Karthika Nair and Monal Gajjar are playing the lead roles along with Harshvardhan Rane, Brahmanandam in supporting roles. Directed by B Chinni Krishna, Produced by Ammiraju Kanumilli and Sekhar Chandra scored music for this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X