»   » అల్లరి నరేష్ "జంప్ జిలాని'' ఫస్ట్ లుక్

అల్లరి నరేష్ "జంప్ జిలాని'' ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జంప్‌ జిలానీ'.. టైటిల్ తో ఇప్పుడు సినిమా వస్తోంది. ఇందులో అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌ హీరోయిన్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. అంబికా కృష్ణ సమర్పకులు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని చిత్రబృందం గురువారం విడుదల చేసింది.

రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన "కలగలుపు'' చిత్రం ఆధారంగా తెలుగులో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అంబికా కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ... తమిళంలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న "కలగలుపు'' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నాము. ఇదే చిత్రాన్ని యూటీవి మలయాళంలో, హిందీ లో రీమేక్ చేస్తోంది. తమిళంలో అంజలి పోషించిన పాత్రకు ఇషా చావ్లాని ఎంపిక చేశాము. తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు.

స్లైడ్ షోలో..ఫస్ట్ లుక్ ఫోటోలు

అల్లరి నరేష్ మాట్లాడుతూ....

అల్లరి నరేష్ మాట్లాడుతూ....

''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు‌. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

''తమిళంలో విజయంవంతమైన 'కలగలుపు' చిత్రానికిది రీమేక్‌. సత్తిబాబు, నరేష్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయి. మా హీరో నటించిన "సుడిగాడు'' చిత్రం తరువాత మళ్ళీ ఈ సినిమాలో రెండు పాత్రలు పోషించారు. దర్శకుడు సత్తిబాబు, నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయి. అనుభవమున్న ఆర్టస్టులతో, టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో మేం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తామని ఖచ్చితంగా ఎప్పగలం. ఈ చిత్రం కూడా అదేస్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

షెడ్యూల్

షెడ్యూల్

ఈ నెల 5 నుంచి 12 వరకు బ్యాంకాక్‌, పుకెట్‌లో పాటల్ని చిత్రీకరిస్తారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, కళ: కిరణ్‌కుమార్‌, కూర్పు: గౌతంరాజు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్ "జంప్ జిలాని'' ఫస్ట్ లుక్

అల్లరి నరేష్ "జంప్ జిలాని'' ఫస్ట్ లుక్

English summary
The first look of Allari Naresh's upcoming film Jump Jilani was unveiled. E Satti Babu is directing the film and Ambica Raja is producing the film. Allari Naresh is playing dual roles in this comedy film and it's the remake of a superhit Tamil film, Kalakalappu. The film also stars Isha Chawla and Swathi Deekshith in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu