»   » అల్లరి నరేష్ లడ్డూ బాబు వచ్చే నెలకు వాయిదా

అల్లరి నరేష్ లడ్డూ బాబు వచ్చే నెలకు వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న 'లడ్డూ బాబు' చిత్రాన్ని తొలుత ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ ఈ నెలలో సినిమా విడుదల వీలు కాకపోవడంతో మార్చి నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ భారీకాయుడిగా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత భూమిక ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పూర్తి కామెడీ నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో నరేశ్‌ మేకప్‌ కోసమే భారీగా వ్యయం చేశారని సమాచారం.

రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది

అల్లరి నరేష్ ఇతర సినిమాల విషయాల్లోకి వెళితే....దీంతో పాటు ఆయన 'జంప్ జిలానీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంబికా కృష్ణ సమర్పణలో అంబిక రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సంగీతం అందిస్తుండగా, దాశరథీ శివేంద్ర సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సమ్మర్లో ఈచిత్రం విడుదలై ప్రేక్షకులకు కితకితలు పెట్టనుంది.

English summary

 Allari Naresh ‘Laddu Babu’ was supposed to hit the screens this month. However, the movie has now been pushed to March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu