For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నవ్వులే వీడు (‘సుడిగాడు’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం'సుడిగాడు'. ఈ చిత్రం ఈ రోజు(ఆగస్టు 24)విడుదల అవుతోంది. అల్లరి నరేష్ కెరీర్ లోనే ఎక్కువ ప్రింట్స్ తో విడుదల అవుతున్న ఈ చిత్రం ప్యారిడీ సన్నివేసాల కలబోతగా నడుస్తుంది. సూపర్ స్టార్లను నరేష్ అనుకరిస్తు నటించే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయనీ, భారతీయుడు, అపరిచితుడు, గబ్బర్ సింగ్ వేషాలలో కనిపిస్తాడు. సినిమాలోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుందని, రచనావౌర్య ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని దర్సకుడు తెలిపారు.

  ఈ చిత్రం గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ.... మిక్చర్‌ పొట్లంలా రుచిగా ఈ చిత్రం ఉంటుంది. గత పదేళ్లకాలంలో వచ్చిన విజయవంతమైన సినిమాల్లోని గుర్తుండిపోయే సన్నివేశాలన్నీ ఏరి ఆ పూలతో ఓ అందమైన దండ అల్లడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో తెలుసా..? ఎంత అనుకరణ అయినా.. అంతర్లీనంగా ఓ కథ ఉండాల్సిందే. ఆ ప్రక్రియకు అయిదు నెలలు పట్టింది అన్నారు. అలాగే 'సుడిగాడు' ప్రచార చిత్రాలు విడుదల చేసిన తరవాత నా తోటి హీరోలంతా నాకు ఫోన్‌ చేశారు. ఆ నలుగురు పెద్ద హీరోలూ హాయిగా నవ్వుకొన్నారని తెలిసింది. రాజమౌళి లాంటి దర్శకులూ మెచ్చుకొన్నారు అన్నారు.

  ఇక 'కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది. ముట్టుకొంటే షాకే...' అని ఎన్టీఆర్‌ అంటే.. అందులో హీరోయిజం కనిపిస్తుంది. అదే అల్లరి నరేష్‌ చెబితే 'కరెంటు పోతేనో...' అనే సెటైర్‌ వినిపిస్తుంది. కత్తి పట్టుకొని 'ఒక్కొక్కడ్నీ కాదు షేర్‌ఖాన్‌, ఒకేసారి వంద మందిని పంపించు..' అన్నాసరే... 'ఈరోజు జూనియర్‌ ఆర్టిస్టులు తక్కువొచ్చారు.. ఓ సున్నా తగ్గించు అన్నాయ్‌' అని ఎక్కసెక్కమాడతారు. స్ఫూఫ్‌లు చేయడం నరేష్‌కి అలవాటే. ఆయన ప్రతీ సినిమాలోనూ హిట్‌ సినిమాలను అనుకరించే సన్నివేశం ఒక్కటైనా ఉంటుంది. ఈసారి అన్నీ అనుకరణ సన్నివేశాలతోనే 'సుడిగాడు' సినిమా అల్లుకొన్నారు. నరేష్‌ నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

  పతాకం : అరుంధతీ మూవీస్
  నటీనటులు : చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు
  సంగీతం: శ్రీవసంత్,
  పాటలు: సిరి వెన్నెల, చంద్రిబోస్, రామజోగయ్యశాస్ర్తీ,
  కెమెరా: విజయ్ ఉలగనాథ్,
  ఎడిటింగ్: గౌతంరాజ్,
  నిర్మాత: డి.చంద్రశేఖర్,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

  English summary
  Allari Naresh’s Sudigadu fim relesing today. Sudigaadu with the tag line 1 ticket 100 movies has created sensation with its trailers and the expectations. It is very clear that Allari Naresh is the king of medium budgeted movies. He is now the ‘Sudden Star’ and the title of ‘sudigadu’ is staying up to its literal meaning. The spoofing film comes from the direction of Bhimineni Srinivas Rao.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X