For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరి నరేష్ 'సుడిగాడు'విడుదల తేదీ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ...మహేష్‌బాబు కాదు కానీ పోకిరి రేంజ్‌లో పంచ్‌ డైలాగులు చెబుతాడు... రోబోలో రజనీకాంత్‌లా వంద తుపాకులు ఒకేసారి పేల్చేస్తాడు... భారతీయుడిలో కమల్‌హాసన్‌లా మర్మకళ ప్రదర్శిస్తాడు... మిత్రవింద కోసం మగధీరుడి అవతారమెత్తుతాడు. ఇన్ని విషయాలు తెలిసిన ఓ కుర్రాడి చుట్టూ తిరిగే కథే మా చిత్రం అన్నారు నరేష్‌.

  దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ''జీరో నుంచి హీరోగా ఎదిగే కథల్నే మనం ఇన్నాళ్లూ తెరపై చూశాం. మా సినిమాలోనూ అలాంటి కుర్రాడే కనిపిస్తాడు. కానీ అతని వేషాలు, విన్యాసాలు అన్నీ వినోదాన్ని పంచుతాయి. నరేష్‌ ఇందులో దాదాపు 20 గెటప్పులు వేశారు. ప్రతి సన్నివేశం ఓ పేరడీలా ఉంటుంది. మా సినిమా ప్రచార చిత్రాన్ని యూట్యూబ్‌లో దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు''అన్నారు.

  ఇక తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు. 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.

  'సుడిగాడు'ట్రైలర్స్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తో ఓవర్ సీస్ బిజినెస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో ఇంతవరకూ లేని కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. నలభై ఐదు లక్షలకు ఈ చిత్రాన్ని అమ్మినట్లు సమాచారం. అదే విధంగా ఆంధ్రాలోని ఏరియా వైజ్ బిజనెస్ కూడా మంచి రేటు పలుకుతోందని తెలుస్తోంది. ఇది నిర్మాతకు మంచి ఆనందం కలిగించే విషయం. పవన్ కళ్యాణ్,వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా అల్లరి నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.

  English summary
  Allari Naresh's SudiGaadu Relesing on 24th of this month. Allari Naresh's market value has increased with Sudigaadu movie. Sudigaadu has fetched Rs 45 lakhs for overseas market for the film's producers. This has happened for the first in Allari Naresh's career. The film is a spoof on all the mass Telugu films and superstars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X