»   » తెలుగు సినిమాలపై ఫుల్లుగా అల్లరి నరేష్ సెటైర్స్

తెలుగు సినిమాలపై ఫుల్లుగా అల్లరి నరేష్ సెటైర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ హీరోగా పిభ్రవరి నుంచి ప్రారంభం కానున్న "పుడింగి" చిత్రంలో తెలుగు సినిమాపై సెటైర్స్ ఫుల్లుగా ఉండబోతున్నాయి. స్టార్స్ సినిమాలని, సెన్సేషన్ క్రియోట్ చేసిన చిత్రాలను ఈ సినిమాలో పేరడి చేసి వ్యగ్యంగా నవ్వించబోతున్నారు. తమిళంలో విజయవంతమైన తమిళ పదం చిత్రానికి రీమేక్ గా పుడింగి రూపొందనుంది. గతంలో పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం, అన్నవరం చిత్రాలు డైరక్ట్ చేసిన భీమినేని శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. తమిళ రెగ్యులర్ మశాలా చిత్రాలను పేరిడి, సెటైర్ చేస్తూ వ్యంగ్యంగా ఈ చిత్రం రూపొంది ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఆ రేంజిలోనే ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని గత ఆరు నెలలుగా స్క్రిప్టు చేస్తున్న వారు అంటున్నారు.

అలాగే అల్లరి నరేష్ తాజాగా మడతకాజా అనే చిత్రాన్ని కూడా కమిటయ్యారు. నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సీతారామరాజు అనే అసెస్టెంట్ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని గతంలో టాస్, అధినేత చిత్రాలను నిర్మించి ప్రస్తుతం వరుణ్ తో ఏమైంది ఈ వేళ చిత్రాన్ని నిర్మిస్తున్న రాదామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో నరేష్...బ్లఫ్ మాస్టర్ తరహాలో వుండే పాత్రను చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం నరేష్...కత్తి కాంతారావు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క వీరభధ్రంని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న అహనా పెళ్ళంట చిత్రంలోనూ నరేష్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu