»   » బాపూ, విశ్వనాధ్ చేతులెత్తేసారు..మరి వంశీ అయినా నెగ్గిస్తాడా?

బాపూ, విశ్వనాధ్ చేతులెత్తేసారు..మరి వంశీ అయినా నెగ్గిస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ కి బాపుతో సుందరాకాండ, కె.విశ్వనాధ్ తో శుభప్రదం, వంశీతో సరదాగా కాసేపు చిత్రాలు ప్రకటించగానే అంతా ఎంత అదృద్టం అని పొగిడేసారు. అలాగే చిత్రంగా ఈ మూడు చిత్రాలు కూడా స అక్షరంతోనే ప్రారంభమయ్యాయి. అయితే సుందరాకాండ, శుభప్రదం రెండూ భాక్సాఫీస్ వద్ద చీదేసాయి. ఇప్పడు అందరి దృష్టీ సరదాగా కాస్సేపు చిత్రంపై ఉంది. గోదావరి జిల్లా యాసతో పాత్రలు,డైలాగులతో కథలు నడిపే వంశీ ఈ సారి ఓ మళయాళ పాత కామిడీ చిత్రాన్ని తెలుగైజ్ చేస్తున్నాడని వినపడుతోంది. డ్రైవర్, మర్డర్, మిస్టరీ, ఓ డెడ్ బాడీ చుట్టూ కథ నడవనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడనుంది. అయితే మరీ పూర్వకాలం కథలు చెల్లుబాటు కావటం లేదని, పాత ఆలోచనలు వదలకపోతే ఝుమ్మందినాదం, యంగ్ ఇండియాలాగే రిలీజైన రోజే రీళ్ళు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందనని అంటున్నారు. ఈ విషయంలో వంశీ ఏం చేయనున్నాడో అంటున్నారు. కొత్తగా ఏదన్నా మ్యాజిక్ జరగకపోతే ఈ కాలం యూత్ ని పట్టుకోవటం కష్టమేనంటున్నారు. ఇప్పుడు అల్లరి నరేష్ లాగే ఇంతకుముందు శ్రీకాంత్ ని కె.విశ్వనాద్ తన స్వరాభిషేకం చిత్రానికి, వంశీ..దొంగ రాముడు అండ్ పార్టీ, బాపు..రాధాగోపాలం కు తీసుకుని ప్లాఫ్ లు ఇచ్చారు. ఇప్పుడు అల్లరి నరేష్ వంతు కాబట్టి ఏం జరుగుతుందో సరదాగా చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu