»   » దర్శకత్వం వహిస్తాను :అల్లరి నరేష్

దర్శకత్వం వహిస్తాను :అల్లరి నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allari Naresh
నిడదవోలు : తనను దర్శకుణ్ణి కావాలని నా తండ్రి ఇవీవీ సత్యనారాయణ కోరుకున్నారని, దానిని తాను మరో నాలుగైదు ఏళ్లల్లో నేరవేర్చుతానని ప్రముఖ నటుడు అల్లరి నరేష్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వెంకటేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రంలో పలు సన్నివేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మరో నాలుగైదేళ్లలో తాను దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. దర్శకుడిగా మారిన అనంతరం ప్రస్తుతం తనను ప్రేక్షకులు ఆదరిస్తున్న హాస్యరస ప్రధాన చిత్రాలకు పూర్తి న్యాయం చేయగలనో లేదో అనే అనుమానం కల్గుతుందన్నారు.

తాను హాస్యపు పాత్రలోనే కాకుండా ఏ పాత్రలోనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగలనని అన్నారు. త్వరలో ఈవీవీ సినిమా బ్యానర్‌పై నా సోదరుడు ఆర్యన్‌రాజేష్‌ నిర్మాతగా తన 50వ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇంతవరకు తాను 45 చిత్రాల్లో నటించానని, ప్రస్తుతం వెంకటేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నానని ఇది తన 46వ చిత్రమన్నారు. ఇవీవీ సినిమా బ్యానర్‌పై 6 చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. అనంతరం తమ బ్యానర్‌పై మరిన్ని చిత్రాలను నిర్మించాలనే ప్రతిపాదన ఉందన్నారు.

ఈవీవీ సారధ్యంలో ఇదే బ్యానర్‌పై పలు చిత్రాలను చిత్రీకరించామని, అయితే మా తండ్రి ఈవీవీ అకాల మరణం కారణంగా గత కొంతకాలంగా చిత్ర నిర్మాణాలను నిలుపుదల చేశామన్నారు. మళ్లీ చిత్రాలను నిర్మించే దిశగా చర్యలు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది చిన్నికృష్ణ దర్శకత్వంలో ఒకటి, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లడ్డుబాబు చిత్రం చిత్రీకరణ పూర్తయిందని, దానిలో తాను భిన్నంగా కనిపిస్తానన్నారు.

తాను లావుగా ఉండి అసలు అల్లరి నరేష్‌.. కాదా అనే అనుమానం కల్గుతుందన్నారు. దీనికి తాను లండన్‌ వెళ్లి ప్రత్యేకంగా మేకప్‌ చేయించుకున్నానని , ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. తమిళంలో రెండు చిత్రాల్లో నటించానని, అయితే ప్రస్తుతం తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం నిస్తున్నట్లు వివరించారు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం గమ్యం అని, దాని ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇంకా కితకితలు, శంభోశివశంభో వంటి చిత్రాలు కూడా మంచి గుర్తింపు తెచ్చాయన్నారు. ఏ చిత్రం అయితే ప్రేక్షకుల మెప్పు పొందుతుందో అదే పెద్ద చిత్రమన్నారు. గత ఏడాది పెద్ద చిత్రాల కన్నా చిన్న చిత్రాలే బాగా హిట్‌ అయ్యాయన్నారు.

అలాగే నిర్మాతలు కూడా చిన్న చిత్రాలకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారన్నారు. గత ఏడాది చిన్న చిత్రాలే ఎక్కువగా విడుదలయ్యాయన్నారు. ప్రతిభ ఉంటే గుర్తింపు దానికదే వస్తుంది తప్ప, వారి వెనుక ఉన్న వారి వల్ల మాత్రం సినీరంగంలో రాణించలేరన్నారు. తన తండ్రి ఇవీవీ మార్గం చూపారని, దాని ద్వారా మనలో ఉన్న ప్రతిభను చూపడం వల్లనే తాను నేడు ఈ స్థాయికి రాగలిగానన్నారు.

మీరు హాస్యాన్ని ఎంచుకోవడంలోని అంతర్యం ఏమిటని ప్రశ్నించగా, తాను హాస్యాన్ని కావాలని మాత్రం ఎంచుకోలేదని, వాటికవే తనకు ధనలక్ష్మి ఐ లవ్‌యూ, తొట్టిగ్యాంగ్‌ వంటి చిత్రాల్లో వచ్చిన పాత్రలకు న్యాయం చేయగలిగానని, అటువంటి చిత్రాలే నన్ను మంచి హాస్యనటుణ్ణి చేశాయన్నారు. హాస్యానికి ఎప్పుడూ ప్రేక్షకాదరణ దక్కుతుందన్నారు.

English summary

 Allari Naresh wants to become directer. Allari Naresh’s movie is currently being shot in Nidadavolu. As per a report published in Sakshi, the movie is being shot in an eye hospital in Gandhinagar area, in Nidadavolu. A number of popular Telugu comedians are reportedly participating in the shoot Isha Chawla and Swathi Dixit will be seen as the heroines in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu