»   » అల్లరి నరేష్ 'లడ్డూబాబు' విడుదల తేదీ

అల్లరి నరేష్ 'లడ్డూబాబు' విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లరి నరేశ్‌.నరేశ్‌, రవిబాబు కాంబినేషన్లో 'లడ్డూబాబు' పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్ భారీకాయుడిగా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత భూమిక ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనున్న ఈ చిత్రం వాలంటైన్స్ డే స్పెషల్ గా పిభ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం పూర్తి కామెడీ నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో నరేశ్‌ మేకప్‌ కోసమే భారీగా వ్యయం చేశారని సమాచారం.

రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది

Allari Narsh's Laddu Babu Release Date !

ఇక అల్లరి నరేష్ తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు'లో అల్లరి నరేష్‌ నటిస్తున్నాడు. ఇందులో తొలిసారిగా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ తమిళంలో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే విద్యాభాస్యసం చేసిన ఈ అల్లరి హీరోకు తమిళ సినిమాలంటే అమితాసక్తి. ఆ మధ్య సముద్రకని దర్శకత్వంలో శశికుమార్‌ నటించిన 'పొరాలి' చిత్రంలో కోస్టార్‌గా నటించారు. సొంత గొంతును వినిపించి తమిళ ప్రేక్షకులకు పరిచయస్థుడయ్యాడు. ఆ తర్వాత తమిళ పరిశ్రమపై కన్నేసినా.. తెలుగులో బిజీకావడంతో తమిళ సినిమాల రీమేక్‌పై పడ్డాడు.

English summary
Allari Narsh's upcoming Fatty love story Laddu Babu set it's Official Release date for February 14th and it was releasing as an Valentin's day Special. This movie Music is composed by Chakri and the Team of this Movie earlier worked for the Debut of Naresh's Allari and another flick Party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu