twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ శౌర్యం తరువాత పెద్ద హీరోలు డేట్స్....

    By Srikanya
    |

    'శౌర్యం' సక్సెస్‌ తర్వాత చాలామంది దర్శకులు, రచయితలు నన్ను సంప్రదించారు. ఒక పెద్ద హీరో కూడా డేట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ 'నచ్చావులే' సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే ఆ సినిమా దర్శకుడు రవిబాబుతో సినిమా చేస్తే బాగుంటుందని మా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అన్నే రవితో చెప్పా. అన్నే రవి ఆయన్ని సంప్రదించారు. 'నచ్చావులే' విడుదల తర్వాత చూద్దామని రవిబాబు సమాధానం చెప్పారు. అన్నట్లే ఆ తర్వాత 'అమరావతి' లైన్‌ చెప్పారు. నాకు బాగా నచ్చింది అంటున్నారు భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనందప్రసాద్. అల్లరి రవిబాబు, భూమిక కాంబినేషన్లో రెడీ అవుతున్న మరో ధ్రిల్లర్ అమరావతి. ఈ చిత్రం డిసెంబర్ మూడున రిలీజు కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్‌. ప్రెస్ మీట్ ఎరేంజ్ చేసారు.

    మీడియాతో ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ..."ఇది ఒక హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా. మా సంస్థ నుంచి ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. రవిబాబులాంటి క్రియేటర్‌ దొరకడం మన చిత్ర పరిశ్రమకి వరం" అని చెప్పారు. అలాగే 'అమరావతి'ని హారర్‌ సినిమా అనను. థ్రిల్లర్‌ అంటేనే కరెక్టు. ఒకే బాణీలో వెళ్లడంలో నాకు ఇంటరెస్టు లేదు. మా సంస్థ నుంచి తీసింది ఏదైనా డిఫరెంట్‌గా ఉండాలని ఆశిస్తా. ప్రతి సినిమాకీ భిన్నత్వాన్ని చూపాలనీ, సంస్థకి గుర్తింపు తీసుకురావాలనీ నా తాపత్రయం. ఇప్పటివరకు రవిబాబు చేసిన సినిమాలు ఒకెత్తు. 'అమరావతి' మరొకెత్తు. ఇది యూత్‌, మాస్‌, ఫ్యామిలీస్‌ తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా. 'శౌర్యం' తర్వాత మా బ్యానర్‌ నుంచి మరో హిట్‌ కొట్టబోతున్నామని ఘంటాపథంగా చెప్పగలను. మా సంస్థ విలువ ఈ సినిమాతో మరింత పెరుగుతుంది అన్నారు.

    కొత్తవాళ్లతో చిన్న సినిమాగా చేద్దామనేది నా ప్లాన్‌. అయితే పూర్తి స్క్రిప్టు సిద్ధమయ్యాక కొత్త ఆర్టిస్టులతో ఈ సబ్జెక్టు అంతగా వర్కవుట్‌ అవదనీ, తెలిసిన ఆర్టిస్టులైతే బాగుంటుందనీ రవిబాబు అన్నారు. అలా భూమిక, స్నేహ, గద్దె సిందూర వంటివాళ్లు ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. అలాగే నెగటివ్‌ షేడ్‌ ఉన్న ఒక కీలక పాత్రకి ఎవరైతే బాగుంటుందనే చర్చ వచ్చినప్పుడు విలన్‌ ఇమేజ్‌లేని నటుడైతే బాగుంటుందని తారకరత్న పేరుని రవిబాబు సూచించారు. ఆ పాత్రని చేయడానికి తారకరత్న ఒప్పుకుంటారా, లేదా అనే సందేహంతోటే ఆయన్ని సంప్రదించాం. కథ విని థ్రిల్లయిపోయి వెంటనే చేయడానికి ఆయన అంగీకరించారు.

    ఆర్టిస్టుల సెలక్షన్‌ చూసి మొదట్లో నేను ఆశ్చర్యపోయిన మాట నిజం. భూమిక, స్నేహల సంగతి సరే. వాళ్లెప్పుడో తమని తాము నిరూపించుకున్నారు. ఈ సినిమాలో తమ పాత్రల్ని చాలా గొప్పగా చేశారు. గద్దె సిందూరని పోలీసాఫీసర్‌గా రవిబాబు చూపించిన తీరు ఆశ్చర్యమనిపిస్తుంది. ఆ పాత్రలో సరిగ్గా ఆమె ఇమిడిపోయింది. అలాగే నెగటివ్‌ పాత్రలో తారకరత్న ఎలా ఉంటారోననే సందేహం మొదట్లో ఉండేది. చూశాక నిజంగా థ్రిల్‌ ఫీలయ్యా. లవ్‌, సెంటిమెంట్‌తో ముడిపడిన థ్రిల్లర్‌ ఈ సినిమా. భూమిక, స్నేహ, తారకరత్న పాత్రల మధ్య ఆ లవ్‌, సెంటిమెంట్‌ అంశాలు ముడిపడి ఉంటాయి.

    ఇంతకంటే ఈ థ్రిల్లర్‌లోని విషయం గురించి ఎక్కువ చెప్పడం సరికాదు. డి.టి.యస్‌. మిక్సింగ్‌ అయ్యాక ఈ సినిమా చూసినప్పుడు ఎంత థ్రిల్‌ కలిగిందో చెప్పలేను. ఒక హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా అనిపించింది. మా సంస్థ నుంచి ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని రవిబాబు రూపొందించారు. ఆయనలాంటి క్రియేటర్‌ దొరకడం మన చిత్ర పరిశ్రమకి వరం. ఆయన ఇమాజినేషన్‌ ఏ స్థాయిలో ఉంటుందో మనకి అంతుపట్టదు. వర్క్‌మూడ్‌లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడ్డం నాక్కూడా కష్టమే. ఆయనలోని ప్రొఫెషనలిజమ్‌ నాకు బాగా నచ్చింది. ఇప్పటివరకు రవిబాబు డైరెక్ట్‌ చేసిన సినిమాల్లోకెల్లా అధిక బడ్జెట్‌ సినిమా ఇది. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు అమెరికాలోనూ ఏకకాలంలో విడుదలవుతున్న రవిబాబు తొలి సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా 90 ప్రింట్లతో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X