»   » నటి ‘అల్లరి’ సుభాషిణి పరిస్థితి చాలా దయనీయం

నటి ‘అల్లరి’ సుభాషిణి పరిస్థితి చాలా దయనీయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అల్లరి' సినిమాతో పాపులర్ అయిన నటి సుభాషిణి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. అయితే కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అనారోగ్యం పాలవ్వడం వల్లనే సుభాషిణి వెండితెరకు దూరమయ్యారు. కొన్ని రోజులుగా ఆమె ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.

తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తన దయనీ స్థితి గురించి వెల్లడించారు. 3 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నానని, తన అనారోగ్యానికి కారణం క్యాన్సర్ అని తెలియక మందులతో సరిపెట్టుకున్నానని, ఎంఎంజే ఆసుపత్రిలో టెస్టులు చేయించాక క్యాన్సర్ అని తెలిసిందన్నారు.

Allari Subhashini suffering from cancer

తన క్యాన్సర్ ఆపరేషన్ కోసం రూ. 5 లక్షల వరకు స్నేహితులు డబ్బు అడ్జెస్ట్ చేశారని, ఎంఎంజే ఆసుపత్రి వారు కూడా ఎంతో హెల్ప్ చేశారని, వారి మేలు ఎప్పటికీ మరువలేనన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాల్లో నటించాలని ఉందని, తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆమె తెలిపారు.

కెరీర్ బావున్నపుడు సంపాదించిన డబ్బు తన సోదరితో కలిసి ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టానని, అయితే నష్టాలు రావడంతో అంతా పోయిందన్నారు. 20 ఏళ్ల క్రితమే తన భర్త చనియాడని, హైదరాబాద్ లో ఒక వ్యక్తి తనకు ఆసరాగా నిలిచాడని, చివరకు అతడు కూడా తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూతురు వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు సుభాషిణి.

English summary
Allari Subhashini suffering from cancer. Allari Subhashini is an Indian actress predominantly appears in Telugu films and TV serials. She plays supporting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu