For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. సాహో రిలీజ్‌పై అల్లు అరవింద్ క్లారిటీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలుస్తోంది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో'. 'బాహుబలి' సినిమా తర్వాత ఈ యంగ్ హీరో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అందుకే తాజాగా అతడు చేస్తున్న 'సాహో'ను నాలుగు భాషల్లో తీసుకు వస్తున్నాడు.

  షూటింగ్ పూర్తైందని సెల్ఫీ

  షూటింగ్ పూర్తైందని సెల్ఫీ

  అత్యధిక బడ్జెతో, హైటెక్నీకల్ వాల్యూస్‌తో విజువల్ వండర్‌గా రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్బంగా ప్రభాస్ చిత్ర యూనిట్‌తో సరదాగా సెల్ఫీ దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాతనే అందరూ ‘సాహో'కు గుమ్మడి కాయ కొట్టేశారని వార్తలు రాశారు.

  సాహో ఆలస్యమంటూ వార్తలు

  సాహో ఆలస్యమంటూ వార్తలు

  ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే, అదే రోజు ‘సాహో' విడుదల ఆలస్యం అవుతుందన్న ప్రచారం ప్రారంభమైంది. ఈ విషయం అన్ని పత్రికలు, న్యూస్ చానెల్స్, వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెళ్లలో చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, సినిమా ఆలస్యంపై చిత్ర యూనిట్ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వాళ్లంతా ఆశావాహధృక్పథంతో ఉన్నారు.

  ఎన్నో కారణాలు

  ఎన్నో కారణాలు

  ‘సాహో' ఆలస్యమైందని చెబుతున్న కొందరు.. దానికి కారణాలను సైతం వెల్లడిస్తున్నారు. గ్రాఫిక్ వర్క్ చాలా మిగిలి ఉందని, అలాగే రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాకీ ఉందని అంటున్నారు. అలాగే కొన్ని సీన్స్ విషయంలో దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని, వాటిని రీ షూట్ చేయాలని భావిస్తున్నాడని ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

  అల్లు అరవింద్ వ్యాఖ్యలు

  అల్లు అరవింద్ వ్యాఖ్యలు

  టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. బుధవారం ఆయన కార్తికేయ నటించిన ‘గుణ 369' ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి మాట్లాడారు. అలాగే, తనతో ఉన్న స్నేహంతో నిర్మాతలు తమ సినిమా రిలీజ్ గురించి అడిగారని చెప్పారు. దీనికి ‘‘ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నన్ను అడిగారు. ఎప్పుడు పెట్టమంటారు అని నన్ను అడిగితే.. ఇప్పుడు ఒక పెద్ద సినిమా 15 నుంచి వెనక్కి వెళ్లింది కాబట్టి మళ్లీ ఆలోచించుకుని చెప్పండి అన్నాను. అందుకే కార్తికేయకు తెలియకుండా ఏదో డేట్ చెప్పాను. కానీ, ‘గుణ 369' సినిమా అనుకున్న రోజే రావచ్చు'' అని ఆయన చెప్పుకొచ్చారు.

  సాహో గురించి

  సాహో గురించి

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రమే ‘సాహో' దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ‘రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం అనుకుంది.

  English summary
  Tollywood Young Hero Prabhas Now doing big project Saaho. This Movie Release In many languages. Some News Viral About Sahoo Release. This Film Was Delayed. he film has been directed by Sujeeth and produced by UV creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X