»   »  కెమెరాకి చిక్కారు : అల్లు అరవింద్...మెగా హీరో తో కలిసి

కెమెరాకి చిక్కారు : అల్లు అరవింద్...మెగా హీరో తో కలిసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నిర్మాతలు అల్లు అరవింద్‌, ఎన్వీ ప్రసాద్‌, ఆయన కుమారుడు అల్లు శిరీష్‌ దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై సుపథం ప్రవేశం ద్వారా ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహాలఘు స్థానం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను తితిదే అధికారులు అందచేసి సత్కరించారు. ఇక్కడ చూస్తున్న ఫొటోలో అల్లు శిరీష్ స్నేహితుడు...ఎమ్ విన్ కూడా ఉన్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు శిరీష్ తో అల్లు అరవింద్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. పరుశరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందుకోసం అల్లు శిరీష్ ...సిక్స్ ప్యాక్ కూడా చేసారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా అల్లు అరవింద్ భావించి రూపొందిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీలను టార్గెట్ చేసే విధంగా పరుశరామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడని తెలుస్తోంది.

Allu Aravind& his son Allu Sirish at Tirumala!

అలాగే.. నిఖిల్ రీసెంట్ గా చేసిన "సూర్య వెర్సస్ సూర్య" లో హీరోయిన్ త్రిధా చౌదరి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఇప్పుడు అల్లు శిరీష్ సరసన చేయబోతోందని సమాచారం. కొత్త జంట తర్వాత గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ...పరుసరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిరీష్ ఈ చిత్రం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

మొదట ఈ స్టోరీ లైన్ ని రామ్ కోసం తర్వాత రానా తో అనుకున్నారు. కానీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు నాగచైతన్య తో ఈ ప్రాజెక్టు ముందుకువెళ్లనుందని అనుకున్నారు. అదీ కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పుడు అల్లు శిరీష్ దగ్గరకు వచ్చింది. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

కుటుంబ భావోద్వేగాల ప్రధానంగా జరిగే కథగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. హీరో,హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కవుట్ చేసాడని అంటున్నారు. అల్లు అర్జున్ కు ఈ కథని నేరేట్ చేసాడని, అయితే తన కన్నా తన తమ్ముడు అయితే సూట్ అయ్యే అవకాసం ఉందని అల్లు అర్జున్ చెప్పాడంతో, అల్లు శిరీష్ కు నేరేట్ చేసాడని చెప్పుకుంటున్నారు.

సారొచ్చారు చిత్రం పరాజయంతో ఉన్న పరుశరామ్..ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. తొలి నాటి నుంచి డైలాగులుకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. పూరీ శిష్యుడైన పరుశరామ్...ఆయన బాటలోనే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో రెడీ అయ్యి హీరోలను కలిస్తూంటారు.

English summary
Allu Aravind and Sirish visited Tirumala for the darshan of Lord Venkateswara Swamy. A while ago, Sirish shared: "After darsanam at Tirumala, with Dad and friend MVN. Feeling blessed & energized".
Please Wait while comments are loading...