twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీకి డేంజరస్ ట్రెండ్.. భర్తలతో కలిసి భార్యలు అలా.. హెచ్చరించిన అల్లు అరవింద్

    |

    కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు కోరుకుంటున్నాయి మళ్ళీ మరో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం పెద్ద ఎత్తున జరిగింది. సినీ పరిశ్రమ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకొనే లేదు. అయితే ఇదే విషయం మీద మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఇండియన్ సినీ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    మంచి స్పందన తెచ్చుకుంటూ

    మంచి స్పందన తెచ్చుకుంటూ


    మాస్ కా దాస్ అనే ఇమేజ్ ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. మే ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాలు ఏర్పడడంతో సినిమా జనాలకు బాగా నోటెడ్ అయింది. దానికి తగ్గట్లుగానే సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్ హీరోయిన్లుగా నటించారు.

    మనస్తత్వం మారిపోయిందని

    మనస్తత్వం మారిపోయిందని

    తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ కి హాజరైన అల్లు అరవింద్ ఈ సినిమా కోసం పనిచేసిన వారిని అభినందిస్తూనే సినీ పరిశ్రమ కోలుకోవాలి, మళ్ళీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ఎందుకంటే గత రెండేళ్ల నుంచి రెగ్యులర్గా సినిమాలకు వెళ్లే ఆడియన్స్ మనస్తత్వం పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. ఆ దెబ్బతో సినీ పరిశ్రమలో కూడా పరిస్థితులేమిటి బాలేదు అని చెప్పుకొచ్చారు.

    హిందీ పరిస్థితి బాలేదు

    హిందీ పరిస్థితి బాలేదు

    ఇదివరకు ఆదివారం వస్తే తనను సినిమాకి తీసుకు వెళ్ళమని భార్యలు భర్తలను అడిగే వాళ్ళని కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆదివారం నాడు ఓటిటిలో ఏ సినిమా వస్తుందో అని ఎదురు చూస్తున్నారని అన్నారు. అయితే అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలు మళ్లీ కుటుంబాలు సినిమాలకు వెళ్లి చూసే సంస్కృతిని తీసుకు వస్తాయని అన్నారు. అంతేకాక హిందీ సినీ పరిశ్రమ పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.

    కలిసి పని చేయాలి

    కలిసి పని చేయాలి

    స్టార్స్ అని అనుకుంటున్న వాళ్ళ సినిమాలకు కూడా మినిమం ఓపెనింగ్స్ ఉండటం లేదని ఒక రకంగా ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు, వారి వారి భేదాభిప్రాయాలు పక్కనపెట్టి సినీ పరిశ్రమ మళ్లీ పుంజుకునేలా చేయడం కోసం కలిసి పని చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    మహేష్ సినిమా ఆడాలి

    మహేష్ సినిమా ఆడాలి

    ఇక చివరిగా మహేష్ బాబు సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదల అవుతోంది కాబట్టి ఆ సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాక మనం అందరం కూడా మహేష్ బాబు సినిమాకి వెళ్లి చూసే అంత అద్భుతంగా ఉండాలని ఆయన కోరారు. ఇక మొత్తం మీద అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    English summary
    Allu Aravind made interesting comments at Ashoka Vanam Lo Arjuna Kalyanam success meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X