»   » అల్లు అరవింద్ చేతికి ఆ ముగ్గురు ఇడియట్స్!?

అల్లు అరవింద్ చేతికి ఆ ముగ్గురు ఇడియట్స్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'త్రి ఇడియట్స్" రిమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకొన్నట్లు అధికారికంగా ఆయన తెలియజేశారు. ఇప్పటికే ఆ చిత్రం పై ఎన్నో వార్తలు వచ్చిన తరుణంలో తాజాగా అల్లు అరవింద్ అన్ని అనుమానాలకు తెరదించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో మహేష్ బాబు, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నటిస్తున్నారని పేర్లు వచ్చిన తరుణంలో వాటికి కూడా తెరదించారు నర్మాత అల్లు అరవింద్. ఇంతకీ ఆ ముగ్గరు ఇడియట్స్ ఎవరనుకుంటున్నారా ? తెలుగులో త్రి ఇడియట్స్ గా పవన్ కళ్యాణ్, సిద్దార్థ, అల్లరి నరేష్ లను ఎంపిక చేసినట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకు హిందీలో దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అరవింద్ ఈ తెలుగు ఈడియట్స్ కి జంటలను వెతికే ప్రయత్నంలో ఉన్నారన్నది సమాచారం.

ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి అల్లు అరవింద్ చాలా గిమ్మిక్కులు ప్రదర్శించాడని వార్తలు వస్తున్నాయి. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సొంతం చేసుకున్నాడంటే అతని మాస్టర్ మైండ్ ఏ పాటిదో ఇప్పటికే అర్థం అయి ఉండాలి..ఏదైయితే నేమి పవన్ సినిమాలు తక్కువైనాయి..అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇడియట్ గా మరో సినిమా వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu