»   » అల్లు ఫ్యామిలీలో విషాదం... ధృవ ప్రమోషన్లకు దూరంగా రామ్ చరణ్!

అల్లు ఫ్యామిలీలో విషాదం... ధృవ ప్రమోషన్లకు దూరంగా రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటు మెగా ఫ్యామిలీ, అటు అల్లు ఫ్యామిలీ అంతా 'ధృవ' మూవీ రిలీజ్ సందడిలో ఉండగా అనుకోని విషాదం చోటు చేసుకుంది. ధృవ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ సోదరి అల్లు భారతి సోమవారం అనారోగ్యంతో మరణించారు.

అల్లు అర్జున్‌కు మేనత్త అయిన భారతి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు . చిరంజీవి భార్య సురేఖ కు భారతి అక్క అవుతుంది. దీంతో ఇటు అల్లు ఫ్యామిలీతో పాటు, చిరంజీవి కుటుంబంలో విషాదం నెలకొంది .

సురేఖ సోదరి

సురేఖ సోదరి

అల్లు భారతి... దివంగత అల్లు రామలింగయ్య పెద్ద కూతురు. ఆమె తర్వాత అల్లు అరవింద్, సురేఖ జన్మించారు. భారతి వయసు 74 సంవత్సరాలు. వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో ఆమె మరణించినట్లు సమాచారం.

కోకాపేటలోని ఫాంహౌస్‌లో అంత్యక్రియలు

కోకాపేటలోని ఫాంహౌస్‌లో అంత్యక్రియలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లోని కోకాపేట ఫాంహౌస్ లో అల్లు భారతి అంత్యక్రియలు జరుపుతారని సమాచారం.

పెద్దమ్మ మరణంతో విషాదంలో చరణ్

పెద్దమ్మ మరణంతో విషాదంలో చరణ్

పెద్దమ్మ భారతి మరణంతో రామ్ చరణ్ విషాదంలో మునిగిపోయారు. నేటి నుండి ఆయన ధృవ మూవీ ప్రమోషన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సంఘటనతో రామ్ చరణ్ ధృవ మూవీ ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనుకోని విషాదం

అనుకోని విషాదం

అల్లు ఫ్యామిలీతో పాటు, మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా అల్లు భారతికి సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన వ్యవహారాల్లో మునిగి పోయారు.

English summary
Allu Aravind’s elder sister Allu Bharathi passed away today morning in Hyderabad due to the serious ailment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu