Just In
- 38 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 58 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లా సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌ను తెస్తున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్..
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లకు వెళ్లి చూసే వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. చాలా మంది టికెట్ కొనుక్కుని సినిమా చూసే అలవాటును మార్చుకుంటున్నారు. దీనికి కారణం మార్కెట్‌లో బోలెడు ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ ఉండడమే. సంవత్సరానికి రూ. 1000 పెట్టి లాగిన్ అయితే.. రిలీజ్ అయిన నెలకో, యాభై రోజులకో ఇంటిల్లిపాది కూర్చుని ఆ సినిమాలను చూసేయొచ్చు. దీంతో డబ్బులు, సమయం రెండూ సేవ్ అవుతాయి. అదే సమయంలో అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎన్నో సంస్థలు స్ట్రీమింగ్‌ను మొదలెట్టేశాయి. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత మరో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకు వస్తున్నారు. ఇంతకీ ఎవరాయన.? వివరాల్లోకి వెళితే..

ఎక్కువ ప్రజాదరణ వీటికే
ప్రస్తుతం డిజిటల్ మార్కెట్‌లో ఎన్నో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కొద్ది రోజులుగా వాటి హవాను చూపిస్తున్నాయి. అలాంటి వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 అత్యంత ప్రజాదరణ పొందాయి. వీటిని భారతదేశంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అందుకే ఈ సైట్లు టాప్‌లో ఉంటున్నాయి.

అన్ని చూపించడమూ కారణమే
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సెన్సార్ ఉండదు. దీంతో మామూలు వాటితో పోల్చుకుంటే అక్కడ ప్రసారం అయ్యేవి పచ్చిగా ఉంటాయి. రొమాంటిక్ సీన్లు, బూతు డైలాగులు, రక్తపాతం ఉన్న సన్నివేశాలు మొదలైనవి వీటిలో యధాతధంగా చూపించేస్తారు. అది కూడా వీటి డిమాండ్ పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

హీరోయిన్లు కూడా చేస్తున్నారు
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ శకం నడుస్తున్న కారణంగా చాలా మంది వాటి వైపు మళ్ళుతున్నారు. బిజినెస్ పరంగా కొందరు ఫిల్మ్ మేకర్లు వాటికి ఆకర్షితులు అవుతుంటే.. డిమాండ్ ఆధారంగా చాలా మంది హీరోయిన్లు, నటులు కూడా వీటిపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది వెబ్ సిరీస్‌లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.

మెగా ప్లాన్ చేసిన బడా ప్రొడ్యూసర్
అందరూ వెళ్లే దారిలో నడవాలని అనుకున్నారో.. లేక మనకంటూ ఓ ఫ్లాట్‌ఫామ్ ఉండాలని డిసైడ్ అయ్యారో తెలియదు కానీ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సరికొత్త ప్లాన్ చేశారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన త్వరలోనే సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను తెలుగు వారికి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

నిఖిల్ సినిమాతోనే మొదలు
త్వరలో తీసుకొస్తున్న ఫ్లాట్‌ఫామ్ కోసం అల్లు అరవింద్ అప్పుడే ఓ సినిమాను కూడా కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. అదే.. యంగ్ హీరో నిఖిల్ - లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వచ్చిన ‘అర్జున్ సురవరం' అని సమాచారం. ఈ సినిమా మంచి టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. దీంతో ఈ సినిమాను ఆయన రూ. 2.50 కోట్లకు తీసుకున్నారని టాక్.