twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగధీర’ను ఆదర్శంగా తీసుకొన్నాం కానీ లక్ష్యంగా పెట్టుకోలేదు..

    By Sindhu
    |

    ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేది బడ్జెట్ లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే బద్రినాథ్ చేసేవాణ్ణి కాను అని అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా బడ్జెట్ పెరగడానికి ఏ ఒక్కరో కారణం కాదు. అందరూ కారణమే అని అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    తాను చేసిన బద్రినాథ్ తన సినిమాల పూర్వకలెక్షన్స్ అన్నింటినీ దాటేస్తుందని చెప్పిన అర్జున్, మగధీర కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందా అంటే తాను చెప్పలేను అని అన్న బన్నీకి నిరాశే ఎదురైంది. ఈ చిత్రం కేవలం హైప్, హంగామా మీద తొలి వారంలో వసూళ్లు రాబట్టుకుంది కానీ సినిమా దారుణంగా ఉందని ప్రేక్షకులు తేల్చేయడంతో బద్రినాథ్ తమిళ ఎంట్రీ సంకటంలో పడింది. మగధీర అందరికీ ఓ బెంచ్ మార్క్ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది అలాంటి సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు. దెబ్బతింటున్నారు. కానీ భారీ స్థాయిలో సినిమా తియ్యడానికి అది ఓ ఉదాహరణగా మారింది. సృజనాత్మక స్వేచ్చనిచ్చింది. అయితే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మేం బద్రినాథ్ తిలయ్యలేదు. సృజనాత్మక విషయంలోనే దాన్నో ఆదర్శంగా తీసుకున్నాం అని అన్నాడు. సినిమాకి మొదట డివైడ్ టాక్ ఉన్నా ప్రస్తుతం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయని చెప్పాడు...

    English summary
    This film opened to mixed talk and that is due to high expectations. Now the talk has settled and the collections are steady. We are happy with the result,” Allu Arjun concluded.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X