For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తండ్రి, నాగబాబుపై బన్నీ ఫన్నీగా.... నాకు క్రెడిట్ ఉందన్న స్టైలిష్ స్టార్!

  By Bojja Kumar
  |

  అల్లు శిరీష్‌, సుర‌భి, సీర‌త్ క‌పూర్, అవ‌స‌రాల శ్రీనివాస్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా ఒక్క క్ష‌ణం. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ల‌క్ష్మీ న‌ర‌సింహ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతోంది. చ‌క్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 28న విడుద‌ల‌వుతుంది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ప్రసంగం ఆకట్టుకుంది.

  బన్నీ ఎంత రిస్క్ చేస్తున్నాడో తెలుసా ?
   నాగ బాబు, అరవింద్ గురించి ఫన్నీగా

  నాగ బాబు, అరవింద్ గురించి ఫన్నీగా

  అల్లు అర్జున్ తనప్రసంగం చాలా ఫన్ క్రియేట్ చేస్తూ మొదలు పెట్టారు. ‘‘ఎంతో ప్రేమతో వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ, ప్రత్యేకంగా నన్న ఆదరిస్తున్న అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. సొంత కొడుకు కాబట్టి, రావాలి కాబట్టి వచ్చిన మా నాన్న గారు అల్లు అరవింద్‌కు, అలాగే చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన తరుపున వచ్చిన నాగేంద్ర బాబు గారు... ఆయన మామూలుగా అయితే నా బాబా... ఇపుడు నా ప్రొడ్యూసర్ గారు కూడా(నవ్వుతూ), ఈ ఫంక్షన్ వచ్చిన నాగేంద్ర బాబు గారి నమస్కారం'' అంటూ తన ప్రసంగం కొనసాగించారు.

   దిల్ రాజు-బన్నీ స్థాయిలో మీ కాంబినేషన్ హిట్టవ్వాలి

  దిల్ రాజు-బన్నీ స్థాయిలో మీ కాంబినేషన్ హిట్టవ్వాలి

  ‘‘నేను ముందు థాంక్స్ చెప్పుకోవాల్సింది ఈ సినిమా ప్రొడ్యూసర్ చక్రి చిగురుపాటిగారికి. మా నాన్న నిర్మాత కాబట్టి ఆ విలువ ఏంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే సినిమా ఇండస్ట్రీ లేదు. శిరీష్ లాంటి హీరోతో మీరు ఈ సినిమా చేస్తున్నందుకు థాంక్స్. నేను దిల్ రాజు గారితో జర్నీ మొదలు పెట్టినట్లు, మీరు శిరీష్‌తో మొదలుపెట్టిన ఈ జర్నీ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.'' అని అల్లు అర్జున్ ఆకాంక్షించారు.

  ఆయన్ను సెకండ్ హీరో అన్నా తక్కువేం కాదు

  ఆయన్ను సెకండ్ హీరో అన్నా తక్కువేం కాదు

  నేను ఆల్రెడీ సినిమా చూశాను. ‘ఒక్క క్షణం' సినిమాలో అవసరాల శ్రీనివాస్ గారు చాలా మంచి రోల్ చేశారు. సెకండ్ హీరో అని చెప్పినా తప్పు లేదు. శీరత్ చాలా అందంగా కనిపించింది. సురభి చాలా క్యూట్ గా కనిపించింది.... అని అల్లు అర్జున్ ప్రశంసించారు.

   ఈ డైరెక్టర్ గురించి ఎప్పుడో చెప్పా... కానీ లైట్ తీసుకున్నాడు

  ఈ డైరెక్టర్ గురించి ఎప్పుడో చెప్పా... కానీ లైట్ తీసుకున్నాడు

  ‘‘ఈ సినిమా శిరీష్‌కు వచ్చినందుకు కొంత క్రెడిట్ నేను కూడా తీసుకుంటున్నాను. ఆనంద్ చేసిన టైగర్ అనే సినిమా చూశాను. బాగా నచ్చింది. అల్లు శిరీష్ చూడలేదు. చూడమని చెప్పాను, ఆ సినిమాలో డైరెక్టర్ థర్డ్ ప్రాసెస్ కనిపిస్తుంది, అతడు ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు నువ్వు సినిమా చేయ్ అని చెబితే శిరీష్ లైట్ తీసుకున్నాడు.... అని బన్నీ గుర్తు చేసుకున్నారు.

   ఓ చిన్న గర్వం ఉంది

  ఓ చిన్న గర్వం ఉంది

  ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా రిలీజ్ అవ్వక ముందు శిరీష్ ఆయన్ను కలిశాడంట. కలిసిన వెంటనే నా దగ్గరకువచ్చి అపుడు నువ్వు చాలా మంచి విషయం చెప్పావు, ఆ డైరెక్టర్‌తో ఆల్రెడీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాను అన్నాడు. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ శిరీష్‌కు వచ్చిందంటే నేను కూడా ఓ కారణం అని ఓ చిన్న గర్వం ఉంది. తెలుగులో అతడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. ఫ్యూచర్లో అతడికి పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. శిరీష్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు విఐ ఆనంద్‌కు చాలా థాంక్స్.'' అని బన్నీ వ్యాఖ్యానించారు.

  నా అంచనా తప్పలేదు, సూపర్ హిట్ కాయం

  నా అంచనా తప్పలేదు, సూపర్ హిట్ కాయం

  ‘ఒక్క క్షణం' సినిమా చూసే వరకు కథ నాకు తెలియదు. వారం క్రితం చూశాను. ఒక సాధారణ ప్రేక్షకుడి మాదిరిగానే చూశాను. చూసిన వెంటనే పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇది హిట్టు సినిమా అని అర్థమైంది. నేను ఇన్వాల్వ్ అయిన సినిమా అయితే నా జడ్జిమెంట్ తప్పు అవ్వచ్చేమో కానీ, ఔట్ సైడర్ కింద చూసిన సినిమా ఏదీ మిస్సవ్వలేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుందని నమ్మకం ఏర్పడింది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే చెబుతారు''... అని బన్నీ తెలిపారు.

  English summary
  Stylish star Allu Arjun graced his brother Allu Sirish's upcoming film Okka Kshanam pre-release function as chief guest in Hyderabad on Monday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X