twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీసారి కొత్త అమ్మాయితో.. కానీ పూజాహెగ్డేతోతో మళ్లీ రిపీట్.. తప్పేమీ కాదుగా.. అల్లు అర్జున్

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో సంక్రాంతి విజేతగా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

    మేకింగ్ విషయంలో

    మేకింగ్ విషయంలో

    'జులాయి'తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మొదలైంది. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' చేశాను. ఎప్పట్నించో ఒక పెద్ద సినిమా పడాలనేది నా కోరిక. దాన్ని క్రియేట్ చేసేదెవరు అనుకుంటూ వచ్చాను. ఒక లార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్క త్రివిక్రమ్ గారే మైండ్‌లోకి వచ్చారు. స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్ అనే విషయంలో మరో మాట లేదు. ఆయన మైండ్‌సెట్ ఎలా ఉందో తెలుసుకుందామని కలిశాను అని అల్లు అర్జున్ వెల్లడించారు.

    జెన్యూన్ సినిమా చేయాలని

    జెన్యూన్ సినిమా చేయాలని

    త్రివిక్రమ్‌తో మా ఆఫీస్‌లోనే క్యాజువల్‌గా కలిశాం. జెన్యూన్‌గా, సరదాగా ఒక సినిమా చేద్దామనుకున్నాం. ఆ జెన్యూనిటీకి జనం కనెక్టయ్యారు. నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన ధైర్యమిస్తూ వచ్చారు. డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మురళీశర్మ నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టుకి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడటం చాలా ఆనందంగా ఉంది. ఆయన వల్ల నా పెర్ఫార్మెన్స్ ఇంకా ఎలివేట్ అయ్యింది.

    సినిమాకు మా జీవితాలను అంకితం

    ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నెపోటిజంపై నా అభిప్రాయం అడిగారు. దేవుడికి ఒక పూజారి కుటుంబం తరతరాలుగా తమ జీవితాన్ని ఎలా అంకితం చేస్తుందో, అలాగే మా కుటుంబం కూడా సినిమాకి మా జీవితాల్ని అంకితం చేసింది. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నా. దీన్ని నెపోటిజం అనుకుంటే అనుకోండి. మేం ప్రజలకు వినోదాన్ని పంచడానికి వాళ్లకు సరెండర్ అయ్యాం" అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Pooja Hedge Exclusive Interview On Ala Vaikunthapurramloo
    పూజా హెగ్డే గురించి స్టైలిష్ స్టార్

    పూజా హెగ్డే గురించి స్టైలిష్ స్టార్

    పూజ హెగ్డేతో 'డీజే' చేసేప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది, ఇంకో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నా. బేసిగ్గా ఒక హీరోయిన్ని రిపీట్ చెయ్యాలంటే కొంచెం భయపడతాను. నేను 20 సినిమాలు చేశాను కాబట్టి, నేను పాత. కొత్త హీరోయిన్‌తో చేస్తే కొత్తగా కనిపిస్తాననేది నా ఫీలింగ్. అందుకే ప్రతిసారీ కొత్తమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం. కానీ రిపీట్ చేసినా బాగుంటుందనిపించిన మొదటి అమ్మాయి పూజ. ఈ సినిమా చేశాక మరోసారి రిపీట్ చేసినా తప్పులేదనిపించింది అని అల్లు అర్జున్ అన్నారు.

    English summary
    Stylish Star Allu Arjun and sensational director Thrivikram Srinivas did magic once again with Ala Vaikunthapurramuloo. This movie released on Sankranti season, and getting good response all over the world. In this occassion, Unit organised Thanks meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X