»   » పూజా హెగ్డేపై అల్లు అర్జున్ తీవ్ర అసంతృప్తి.. కారణమేమిటంటే..

పూజా హెగ్డేపై అల్లు అర్జున్ తీవ్ర అసంతృప్తి.. కారణమేమిటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాథం చిత్రంతో మరోసారి సక్సెస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం కోసం అందాల తార పూజా హెగ్డేతో జతకట్టాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానెల్ ద్వారా అభిమానులతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ఓ విషయంలో పూజాపై అల్లు అర్జున్ అసంతృప్తిని వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది.

అల్లు అర్జున్ మంచి డాన్సరని పూజా హెగ్డే కితాబు

అల్లు అర్జున్ మంచి డాన్సరని పూజా హెగ్డే కితాబు

దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. అతను ఒక మంచి డ్యాన్సర్. అల్లు అర్జున్ టాలీవుడ్ మైఖేల్ జాక్సన్ అని కితాబు ఇచ్చింది. అందుకు వేదికపైనే అల్లు అర్జున్ సంతోషంతో పొంగిపోయాడు. ఆ తర్వాత పూజాపై కూడా స్టైలిష్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించడంతో చెల్లుకు చెల్లు అయిపోయింది.

స్టైలిష్ స్టార్‌తో డ్యాన్స్ చాలా కష్టం

స్టైలిష్ స్టార్‌తో డ్యాన్స్ చాలా కష్టం

ఆదిత్య మ్యూజిక్ నిర్వహించిన చర్చ కార్యక్రమం కోసం ఒకే వేదికపైన మళ్లీ వారిద్దరూ కలుసుకొన్నారు. ఈ సందర్భంగా కూడా అల్లు అర్జున్ డ్యాన్స్ గురించే ప్రస్తావించింది. అతనితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పింది. అయితే తన నటన గురించి, యాక్షన్ గురించి పూజా చెప్పకపోవడం అల్లు అర్జున్ కొంత ఇబ్బందిగా ఫీలయ్యాడట.

పూజా దృష్టిలో కేవలం డాన్సర్ నేనా అని అల్లు అర్జున్ కామెంట్

పూజా దృష్టిలో కేవలం డాన్సర్ నేనా అని అల్లు అర్జున్ కామెంట్

ఎప్పుడూ నా డ్యాన్స్ గురించే పూజా మాట్లాడుతున్నది. ఆమెకు నేను ఒక డ్యాన్సర్‌గా మాత్రమే కనపడుతున్నానా? నాకు వేరే విధంగా కాంప్లిమెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదే అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. నిజానికి ఈ చిత్రంలో అల్లు అర్జున్, పూజా చేసిన డ్యాన్స్‌లు బ్రహ్మండంగా కనిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టు స్పష్టమవుతున్నది.

పాటపై బ్రహ్మణుల ఆగ్రహం

పాటపై బ్రహ్మణుల ఆగ్రహం

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీశ్ శంకర్ దువ్వాడ జగన్నాథం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. గుడిలో బడిలో పాటపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చిత్రం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది.

ట్యూబ్‌లైట్‌తో పోటీకి సిద్ధం

ట్యూబ్‌లైట్‌తో పోటీకి సిద్ధం

దువ్వాడ జగన్నాథం చిత్రానికి దక్షిణాదిలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంలో శింబు నటించిన ఏఏఏ చిత్రం, జయం రవి సినిమా వనమగన్, సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ జూన్ 23న విడుదల కానున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు పోటీని ఎలా తట్టుకొంటాయి అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

English summary
For the first time ever, Duvvada Jagannadham’s lead pair Allu Arjun and Pooja Hegde went live on Aditya Music’s YouTube channel to intercat with fans and talk about their upcoming mvoie – DJ. Allu Arjun surprised us when he said “Pooja has never really paid me any compliment.” She had only praised his dancing so far. ” I am only a dancer to her.” revealed the actor. That’s when Pooja mentioned that Allu Arjun was always fishing for compliments, He obviously denied it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu