»   » మళ్ళీ మెగాఫ్యామిలీకి దగ్గరవుతున్న డైరెక్టర్

మళ్ళీ మెగాఫ్యామిలీకి దగ్గరవుతున్న డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అది లేకపోతే ఎంతటివారినైనా వదిలేస్తుంది. అందుకే, వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న వాడే ఇక్కడ రాణిస్తాడు. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాణ్ణి ఇక్కడెవరూ క్షమించరు. పాపం... దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. 'బొమ్మరిల్లు' తర్వాత అల్లు అర్జున్ తో భాస్కర్ చేసిన రెండో సినిమా 'పరుగు' బాక్సాఫీసు వద్ద ఓ మోస్తర్ హిట్ అనిపించుకొన్న విషయం విధితమే...

'బొమ్మరిల్లు", 'పరుగు" వంటి హిట్ చిత్రాలను అందించిన భాస్కర్ తన మూడవ సినిమా 'ఆరెంజ్" ఫ్లాప్ కి డీలా పడిపోయాడు. 'ఆరెంజ్" సినిమా ప్లాప్ తో మెగా ఫ్యామిలి నుండి దూరంగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ తో క్లోజ్ గా ఉంటూ 'పరుగు" సినిమా కాంబినేషన్ ని రిపీట్ చెయ్యాలని ఆరాటపడుతున్నాడు. ఆ సినిమా డెఫినెట్ గా ఉంటుందని 'పరుగు" సినిమా సంగీత దర్శకడు దేవిశ్రీ ప్రసాదే దీనికి కూడా సంగీతాన్ని అందిస్తాడని సమాచారం. సో ఈ సారైనా భాస్కర్ కి లక్ కలిసొస్తుందో లేదో మరి.

English summary
Bommarillu Bhaskar is all set for a big move. According to some close sources, he seems to be maintaining his place within the inner circles of the mega family, thanks to Bunny, who always had a soft place for Bhaskar after their movie Parugu was a run away hit.
Please Wait while comments are loading...