Just In
Don't Miss!
- Sports
4లో 2 టెస్టులు పింక్ బాల్‌తో అంటే మరీ టూమచ్: సీఏ ప్రతిపాదనపై గంగూలీ
- News
దిశ నిందితుల ఎన్కౌంటర్ అమెరికా రేడియోలో ప్రసారం..
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Finance
సెన్సెక్స్ 334..నిఫ్టీ 97 పాయింట్లు: స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మరో సింగిల్‌తో ఊపేందుకు తమన్ రెడీ.. అలవైకుంఠపురములో నుంచి అదిరిపోయే పాట
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చేందుకు రెడీ అవుతోన్న చిత్రం అలవైకుంఠపురములో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అంటూ రెండు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టిన వీరిద్దరు.. మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తూ ఉన్నారు. తాజాగా మరో సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. మరి ఈ పాట ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

ట్రెండీగా మారిన సామజవరగమన
అలవైకుంఠపురములో నుంచి విడుదలైన మొదటి సాంగ్.. సామజవరగమన. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ఈ పాట వైరల్‌గా మారింది. తెలుగులో అత్యధిక మంది వీక్షించిన, లైకులు సాధించిన పాటగా రికార్డులకెక్కింది. ఇప్పటికీ ఈ సాంగ్ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది.

అందమైన లోకేషన్లలో చిత్రీకరణ
ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సామజవరగమనను.. అంతే రేంజ్‌లో చిత్రీకరిస్తున్నారు. అందుకోసం చిత్రబృందం పారిస్‌లోని అందమైన లొకేషన్లను వేటాడి పట్టుకున్నారు. శేఖర్ మాష్టర్ నేతృత్వంలో ఈ పాటను పూజాహెగ్డే, అల్లు అర్జున్‌లపై అద్భుతంగా తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని సమాచారం.

రాములో రాముల అంటూ సెన్సేషన్..
రెండో పాటగా విడుదలైన రాములో రాముల సాంగ్ మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పార్టీలు, పబ్‌లు, డీజేలు ఇలా ఎక్కడ చూసినా రాములో రాముల అనాల్సిందే. ఈ పాటను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్పులు వైరల్ అయ్యాయి.
|
మూడో పాట కూడా సిద్దం..
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం తమన్ జపం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఏ పాట విడుదలైనా తమన్ పేరే కనిపిస్తోంది. ఆయన పాటే వినిపిస్తోంది. ప్రతి రోజూ పండగే, డిస్కో రాజా ఇలా విడుదలైన ప్రతీ పాట తమన్ మార్క్‌ను చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో తమన్ దూసుకుపోతున్నాడు. మరో సారి తన స్టామినా చూపేందుకు అలవైకుంఠపురములో నుంచి మూడో పాటను సిద్దం చేశాడు.

ఓఎమ్‌జీ డ్యాడీ..
#OMGDaddy అనే పాటను బాలల దినోత్సవం సందర్భంగా రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు సంబంధించిన సాంగ్ టీజర్‌ను ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ పాట ఏ మేరకు ట్రెండ్ సెట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది.