»   » దుర్భాషలు: బన్నీతో సారీ చెప్పించిన త్రివిక్రమ్!

దుర్భాషలు: బన్నీతో సారీ చెప్పించిన త్రివిక్రమ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన పీఆర్‌ఓ దురుసుప్రవర్తనకు అల్లు అర్జున్ సారీ చెప్పాల్సి వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు బన్నీ సమయానికి హాజరుకాలేదు. 2 గంటల పాటు జర్నలిస్టులను వేయిట్‌ చేయించాడు. దీంతో జర్నలిస్టులు ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్‌ చేశారు. ఈ విషయాన్ని వార్తగా రాసిన జర్నలిస్టు నాగరాజును బన్నీపీఆర్ఓ దుర్భాషలాడారు. దీంతో అతను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసాడు. దీంతో గొడవ పెద్దదైంది. పరిస్థితి అదుపులోకి తేకపోతే ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాపై పడుతుందని భావించిన త్రివిక్రమ్...బన్నీకి దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే బన్నీ జర్నలిస్టులకు సారీ చెప్పినట్లు టాక్.

ఈ రోజు విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విషయానికొస్తే...సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించాడు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు అదుర్స్ అంటున్నారు. ఇక సినిమాకు హైలెట్ క్లైమాక్స్ అని అంటున్నారు.

Allu Arjun apologizes to Journalists

అయితే సరైన ప్లేసింగ్ లేని సాంగులు సినిమా ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. కానీ పాటల చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమా కథ చాలా బావుందనే అభిప్రాయం ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. అయితే బన్నీని ఇప్పటి వరకు ఎనర్జిటిక్ గా చూసిన ప్రేక్షకులకు ఇందులోని స్లో స్క్రీన్ ప్లే అతనికి సెట్ కాలేదనే భావన కలుగింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా బన్నీ అదరగొట్టాడు. దేవిశ్రీ తన సంగీతం ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Tollywood star Allu Arjun apologizes to Journalists.
Please Wait while comments are loading...