»   » అల్లు అర్జున్ 'ఆర్య-2' అక్కడ పెద్ద రికార్డు

అల్లు అర్జున్ 'ఆర్య-2' అక్కడ పెద్ద రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం ఆర్య 2 మళయాళం రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం విపరీతమైన పోటీతో దివ్య పిక్చర్స్ వారు కొనుగోలు చేసారు. ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ చిత్రాలు మళయాళంలోకి డబ్బింగై మంచి విజయం సాధించటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. పిబ్రవరి ఐదున రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అక్కడ కొనుక్కున్న నిర్మాతలకు విడుదలకు ముందే రెండు కోట్లు వరకూ టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ఆర్య, దేశముదురు చిత్రాలు రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి అక్కడ స్టార్స్ చిత్రాలకు మంచి పోటీనిచ్చాయి. ఏ తెలుగు హీరోకు ఇంత భారీగా కేరళలో మార్కెట్ లేకపోవటంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.అలాగే గుణశేఖర్ వరుడు చిత్రం మళయాళ డబ్బింగ్ వెర్షన్ కోసం అప్పుడే ఎంక్వైరీలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య-2 చిత్రంలో అల్లు అర్జున్, కాజల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అలాగే ఆడియో ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu