»   » ఇండియన్ సమురాయి గా ఇరగదీస్తా...అల్లు అర్జున్

ఇండియన్ సమురాయి గా ఇరగదీస్తా...అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త పెళ్ళి కొడుకు అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాధ్. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయి గా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ...'బద్రీనాథ్"లో మరోసారి మాస్ పాత్రలో నటిస్తున్నా. ఓ చారిత్రక కథాంశం వున్న సినిమా అని అనుకుంటున్నారంతా. అది నిజంకాదు. ఒకానొకప్పటి దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నా రోల్ ఇండియన్ సమురాయ్. కత్తి, డాలు గిరగిరా తిప్పుతాను, ఫైట్లు అలరిస్తాయి. బాగా వర్క్ అవుట్ అయ్యే సినిమా ఇది. సమురాయ్ గా నన్ను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. తుపాకుల కంటే కత్తులు, కటారులు బాగా పనిచేస్తాయనడానికి చాలా ఉదాహరణలు వున్నాయి. టాప్ టెన్ యాక్షన్ సినిమాలను పరిశీలిస్తే... ఆ విషయం అర్థమవుతుంది అన్నారు.

ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది కావటంతో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు.

English summary
Arjun plays the role of an Indian Samurai. Badrinath is a modern film with devotional touch. Chinni Krishna penned the story for this film which is being made at a high budget.VV Vinayak is the director of Badrinath.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu