»   » కొత్త జంట: తండ్రి, తమ్ముడితో కలిసి అల్లు అర్జున్

కొత్త జంట: తండ్రి, తమ్ముడితో కలిసి అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: గీతాఆర్ట్స్ బ్యానర్ లో మారుతి తెరకెక్కిస్తున్న సినిమా 'కొత్తజంట'. ఇందులో అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్నారు. బన్నీవాసు నిర్మాత. తొలి చిత్రం గౌరవం తర్వాత అల్లుశిరీష్ నటిస్తున్న సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జె.బి.సంగీత దర్శకుడు.

  ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.786' చిత్రంలోని 'అటు అమలాపుంర' ఐటం సాంగును అల్లు శిరీష, మధురిమలపై గణేష్ మాస్టర్ కోరియోగ్రఫీలో తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో శిరీష్ సోదరుడు అల్లు అర్జున్, తండ్రి అల్లు అర్జున్ సినిమా సెట్‌ను సందర్భించారు. ఈ సందర్శంగా అందరూ కలిసి ఇలా ఫోటోకు ఫోజు ఇచ్చారు.

  అల్లు శిరీష్ తోలి చిత్రం గౌరవం పరాజయం పాలవడంతో, 'కొత్త జంట' చిత్రాన్ని ఎలాగైనా విజయపధంలో దూసుకెళ్లడానికి కావాల్సిన అన్ని హంగులను సమకూరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి పాటలను రీమిక్స్ చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. రామ్ చరణ్ 'మగధీర'(రెండో సినిమా), 'రచ్చ', అల్లరి నరేష్ 'సీమ శాస్త్రి' ఇలా మంచి ఉదాహారణలే ఉన్నాయి. మారుతీ 'ప్రేమ కధా చిత్రమ్'లో కూడా 'వెన్నెలైనా..వేకువైనా' పాత రీమిక్స్ చేశారు.

  బూతులే లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా..
  నా చిత్రాలపై పలు ప్రసార మాధ్యమాల్లో నన్నోక బూతు డైరక్టర్ గా ప్రొజెక్ట్ చేస్తూ సెటైర్లు వేస్తుంటారు. 'ఈరోజుల్లో', 'బస్టాప్‌' చిత్రాలు ద్వందార్థాల వల్ల ఆడాయనీ, మారుతీ ఆ తరహా చిత్రాలే తీస్తాడనే విమర్శ ఇండిస్టీ నుంచి వచ్చింది. ఆ విమర్శ నుంచి బయటపడటానికి నా దగ్గర ఉన్న చాలా కథల్లో ఒకదాన్ని బయటకు తెచ్చి 'ప్రేమకథాచిత్రమ్‌'గా మార్చాను. సినిమాలో విషయం, చెప్పేదానిలో దమ్ముంటే... ప్రేక్షకులు ఆదరిస్తారనే నిరూపించారు. ఊహించని విధంగా ఆదరించారు. కొత్త జంటను కూడా అదే విధంగా తెరకెక్కిస్తున్నాను అని మారుతి ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

  English summary
  Allu Arjun and Allu Aravind visited ‘Kotha Janta’ team on the sets. Item song ‘Atu Amalapuram’ from Chiranjeevi’s ‘Khaidi No 786′ would be used in the film. This song has now been shot on Madhurima and Sirish.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more