»   » 'బద్రీనాథ్‌'తో అల్లు అర్జున్‌ తమిళ చిత్రసీమకి ...

'బద్రీనాథ్‌'తో అల్లు అర్జున్‌ తమిళ చిత్రసీమకి ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బన్నీ' సినిమా తరవాత అల్లు అర్జున్‌, వినాయక్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'బద్రీనాథ్‌'. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్జున్‌ ని తమిళ చిత్రసీమకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. 'బద్రీనాథ్‌' ప్రారంభోత్సవం గురువారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్‌ లోని దైవ సన్నిధానంలో జరిగింది. అల్లు అర్జున్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి క్లాప్‌ నివ్వగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రచయిత చిన్నికృష్ణ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. 'మగధీర' చిత్రం తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే మరో భారీ చిత్ర ఇది.

ఇక 'బద్రీనాథ్‌' కథలో మాస్‌, యాక్షన్‌ అంశాలతోపాటు అన్ని హంగులూ ఉన్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా పునర్నిర్మాణ హక్కుల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ ఏర్పడిందని వారు చెప్తున్నారు. ఇందులో తమన్నాహీరోయిన్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. చిన్నికృష్ణ అందించిన ఒక పవర్ ‌ఫుల్‌ కథను తనదైన భారీ శైలిలో వినాయక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కళ: ఆనందసాయి, ఫొటోగ్రఫీ: ఎస్.రవి వర్మన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ కంట్రోలర్స్: బాబు, జి.జి.కె.రాజు, నిర్మాణసారథ్యం: 'ఠాగూర్' మధు, నిర్మాత: అల్లు అరవింద్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu