మహేష్‌తో అల్లు అర్జున్ హోరాహోరీ పోరు.. చివరకు ఇలా ఫినిష్! ఇక మెగా పవర్‌స్టార్ వంతే!!
సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డును తిరగరాసేస్తూ అల్లు అర్జున్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. తన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' రూపంలో మహేష్ గత రికార్డును అధిగమించాడు ఈ స్టైలిష్ స్టార్. ఈ ఏడాది సంక్రాంతి రేస్‌లో నిలబడి సూపర్ సక్సెస్ అందుకున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించాడు. వివరాల్లోకి పోతే..

సూపర్ హిట్ కాంబో.. కలెక్షన్ల వరద
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. గతంలో ''జులాయి, s/o సత్యమూర్తి'' సినిమాలతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో హాట్రిక్ హిట్ సాధించారు. దేశవిదేశాల్లో ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది.

మహేష్ బాబు గత రికార్డుపై అల్లు అర్జున్ కన్ను
ఇక ఓ వైపు మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కు గట్టి పోటీ ఇస్తూనే మరోవైపు అదే మహేష్ బాబు గత రికార్డుపై కన్నేశాడు అల్లు అర్జున్. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘భరత్ అనే నేను' పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు బన్నీ.

USAలో ఆదివారం హంగామా
‘అల.. వైకుంఠపురములో' చిత్రంతో ‘భరత్ అనే నేను' చిత్రాన్ని అలవోకగా బీట్ చేసేశాడు అల్లు అర్జున్. ఇప్పటిదాకా USAలో 5వ స్థానంలో ఉన్న ‘అల.. వైకుంఠపురములో' చిత్రం నిన్న ఆదివారం $3.42 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టి 4వ స్థానంలోకి వచ్చేసింది.

మహేష్ ఫినిష్.. ఇక రామ్ చరణ్
దీంతో USA మార్కెట్‌లో మహేష్ బాబు ‘భరత్ అనే నేను' మూవీ 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ‘రంగస్థలం' $3.5 మిలియన్ మార్క్‌ని కూడా దాటే దిశగా పరుగులు తీస్తోంది ‘అల.. వైకుంఠపురములో' మూవీ.

ప్రస్తుతం USA టాప్ 5 తెలుగు సినిమాలు
1. బాహుబలి2- $21 మిలియన్ డాలర్స్
2. బాహుబలి- $16.8 మిలియన్ డాలర్స్
3. రంగస్థలం- $3.5 మిలియన్ డాలర్స్
4. అల.. వైకుంఠపురములో- $3.42 మిలియన్ డాలర్స్
5. భరత్ అనే నేను- $3.41 మిలియన్ డాలర్స్
Recommended Video

అల్లు అర్జున్- పూజా హెగ్డే రొమాన్స్
గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో అల.. వైకుంఠపురములో మూవీ రూపొందింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











