»   » స్టైలిష్ స్టార్ ఇప్పుడు 'హాట్ స్టార్': అల్లు అర్జున్ కొత్త బ్రాండ్

స్టైలిష్ స్టార్ ఇప్పుడు 'హాట్ స్టార్': అల్లు అర్జున్ కొత్త బ్రాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరస హిట్లతో దూసుకుపోవటం అల్లు అర్జున్ కు కలిసి వచ్చే అంశం. ఆయన ఇటు సినిమాలపై దృష్టి పెడుతూనే అటు యాడ్స్ పైన కూడా ఓ కన్నేస్తున్నారు. రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు హిట్లు తో ఆయన కు యాడ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది.

ఈ నేపధ్యంలో ఆయన్ను చాలా కంపెనీలు తమకు యాడ్ చేయమని అడుగుతున్నాయట. అయితే ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తమ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్ గా అడిగుతున్న వారిలో కొందరిని ఎంపిక చేసుకుని బన్ని ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన హాట్ స్టార్ అనే స్ట్రీమింగ్ చానెల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఓ యాడ్ ని సైతం చేసారు.

'హాట్ స్టార్' అనే స్ట్రీమింగ్ ఛానెల్ కి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో ప్రచారకర్తగా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే బన్నిపై తీసిన యాడ్ కూడా టీవీల్లో టెలీకాస్ట్ అవుతోంది.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...'నేను హాట్ స్టార్ కి ప్రచారకర్తగా ఉండటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక మీదట నాకు వానిటి వ్యాన్ లో పెద్ద టివి అవసరం లేదు. నా ఫోన్ లో హాట్ స్టార్ కి వెళితే చాలు... మొత్తం అక్కడి నుంచే నాకు కావల్సింది చూడొచ్చు' అని చెప్పాడు. హాట్ స్టార్ స్ట్రీమింగ్ చానెల్ ఇండియాలో దాదాపు 8 భాషల్లో ప్రసారమవుతోంది.

English summary
Stylish star Allu Arjun has been roped as the brand ambassador for India’s largest premium streaming platform, Hotstar. Accordingly a promo featuring Allu Arjun has been released on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu