»   » హ్యాపీ బర్త్ డే బోయపాటి: అల్లు అర్జున్‌తో మూవీ డీటేల్స్

హ్యాపీ బర్త్ డే బోయపాటి: అల్లు అర్జున్‌తో మూవీ డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప‌వ‌ర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త్వరలో చిత్రం సెట్స్ మీద‌కి వెల్ల‌నుంది. ఈ రోజు(ఏప్రిల్ 25) బోయపాటి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబూతూ ఆ సినిమా వివరాలపై ఓ లక్కేద్దాం.

అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మ్యూజిక్‌తో స‌క్స‌స్‌ల మీద స‌క్స‌స్‌లు కొడుతున్న థ‌మ‌న్. ఎస్.ఎస్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. తాజాగా అందుతున్న సమాచారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన టీవీ నటిని హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Allu Arjun-Boyapati Srinu movie details

హిందీలో పాపులర్ అయిన టీవీ నటి సోనారికా ఈ చిత్రంలో హరోయిన్ గా చేసే అవకాశం ఉంది. సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగ శౌర్య సరసన ‘జాదూగాడు' చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. అందం, పర్ ఫెక్ట్ ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉండటంతో బోయపాటి దృష్టిలో పడింది. అల్లు అర్జున్ కూడా ఆమెను ఓకే చేసినట్లు టాక్.

గతంలో ఓ ప్రెస్ మీట్లో అల్లు అర‌వింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామని తెలిపారు.

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధంచేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను అన్నారు.

English summary
Film Nagar source sauid that, Sonarika, a popular TV actress, who made her debut in Naga Shourya’s Jadoogadu is set to shake a leg with Allu Arjun in Boyapati direction.
Please Wait while comments are loading...