»   » బాలయ్యతో బన్నీ క్లాష్?

బాలయ్యతో బన్నీ క్లాష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రానున్న వేసవిలో తెలుగు సినిమా బాక్సాఫీసు వద్ద మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తెలుగు సినిమా అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా ఫ్యామిలీ నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీసు వద్ద తలపడబోతున్నారు. లెజెండ్ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా....అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రం కూడా అదే రోజు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

లెజెండ్ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. ఇప్పటి వరకు హీరో పాత్రలు చేస్తూ వచ్చిన జగపతి బాబు తొలి సారిగా పూర్థి స్థాయి విలన్ పాత్ర చేస్తుండటం కూడా ఈ చిత్రానికి మరో హైలెట్. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Allu Arjun clash with Balakrishna?

అల్లు అర్జున్, సురేందర్‌రెడ్డి కలయికలో వస్తున్న తొలి సినిమా రేస్ గుర్రం. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది.

చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
It's going to be one of the most interesting battles, of sorts, at the box-office this summer. Few days ago, Balakrishna, Radhika Apte and Sonal Chauhan starrer Legend announced that the film will hit the screens on March 28 and now, buzz is that even Allu Arjun's upcoming film Race Gurram might hit the screens on the same date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X