»   » డ్యాన్సర్ల చేతులు విరగ్గొట్టిన అల్లు అర్జున్..!!

డ్యాన్సర్ల చేతులు విరగ్గొట్టిన అల్లు అర్జున్..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదేంటి పాపం అల్లు అర్జున్ చేయి విరిగి కట్టుతో తిరుగుతూ వుంటే ఆయనెళ్లి డ్యాన్సర్ల చేతులు విరగ్గొట్టాడని అంటున్నారు అని ఆశ్టర్యపోతున్నారా..?? అదేం లేదు కానీ అల్లు అర్జున్ వరుడు షూటింగ్ లో గాయపడి చేతికి కట్టుకట్టుకొని తిరుగుతుండటం మనం చూసాము కదా..! కానీ అప్పటికి ఇంకా వరుడులో ఓ పాటు బాకీ వుందట. కానీ దర్శకనిర్మాతలోమో ఈ నెల 31న సినిమా విడుదల కానుందని ప్రకటించేసారు. దీంతో అల్లు అర్జున్ ఉగాదిలోపు ఈ పాటను పూర్తి చేస్తానని మాటిచ్చాడట. కానీ డాక్టర్లేమో కట్టు విప్పకూడదని సూచించారట.

ఇలాంటి సమయంలో ఆయన చేతికి వున్న కట్టుకు ఓ నల్లటి రిబ్బన్ లాంటిది చుట్టుకొని ఈ పాటను పూర్తి చేసాడట. ఆయనొక్కడే కట్టుతో వుండి మిగితావారు సాదాగా వుంటే బాగోదని ఇదిగో వారి చేతికి కూడా ఇలా రుమాలు చుట్టేసి పాట పూర్తి చోసారట. అర్జున్ కూడా అనుకున్న సమయానికి పాట పూర్తి చెయ్యగలిగాడు...అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక మీతో హ్యాట్సాఫ్ అనిపించుకోవడానికి ఈ నెల 31న వరుడుగా వస్తున్నాడు. మరి అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu