»   » బన్నీ వచ్చి 15 ఏళ్ళు గడచిపోయింది..గంగోత్రి జ్ఞాపకాలు, ఆ రెండింటిని గుర్తు చేసుకున్న తమన్!

బన్నీ వచ్చి 15 ఏళ్ళు గడచిపోయింది..గంగోత్రి జ్ఞాపకాలు, ఆ రెండింటిని గుర్తు చేసుకున్న తమన్!

Subscribe to Filmibeat Telugu
Allu Arjun Tweets About His 15 Years Journey In Film Industry

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు డాన్సులు, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కు అల్లు అర్జున్ పర్యాయపదంగా మారిపోయాడు. అల్లు అర్జున్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే 15 ఏళ్ళు గడచిపోయింది. 2003 మార్చి 28 న అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి విడుదలయింది. ఈ చిత్రం మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరించింది.

ఆ చిత్ర జ్ఞాపకాలని బన్నీ గుర్తు చేసుకున్నాడు. ఈ పదిహేను సంవత్సరాలలో నటుడిగా బన్నీ బాగా రాటుదేలాడు. మెగా మేనల్లుడిగా అడుగుపెట్టినా తన ప్రతిభతో అల్లు అర్జున్ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించడం విశేషం.

15 ఏళ్ళు గడచిపోయాయి

15 ఏళ్ళు గడచిపోయాయి

అల్లు అర్జున్ సినీరంగప్రవేశం చేసి 15 ఏళ్ళు గడచిపోయాయి. ఈ సంతోషాన్ని బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

 గంగోత్రి జ్ఞాపకాలు

గంగోత్రి జ్ఞాపకాలు

అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రం గంగోత్రి 2003 మార్చి 28 న విడుదలయింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకుడు. అశ్విని దత్ నిర్మాత. ఈ సందర్భంగా బన్నీ వారికి కృతజ్ఞతలు తెలియజేసాడు.

 స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన వైనం

స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన వైనం

మొదట్లో గంగోత్రి, ఆర్య వంటి ప్రేమ చిత్రాలు చేసిన బన్నీ నెమ్మదిగా కమర్షియల్ హీరోగా ఎదిగి స్టైలిష్ స్టార్ గా మారాడు. అల్లు అర్జున్ నటించిన చిత్రాలు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి.

బన్నీకి భారీ మార్కెట్

బన్నీకి భారీ మార్కెట్

ఈ పదిహేను ఏళ్లలో బన్నీ క్రేజ్ బాగా పెరిగింది. బన్నీ చిత్రాల మార్కెట్ కూడా పెరగడం విశేషం. టాలీవుడ్ టాప్ హీరోలలో ప్రస్తుతం బన్నీ కూడా ఒకరు. అల్లు అర్జున్ కు కేవలం తెలుగులో మాత్రమే కాదు మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్.

తమన్ స్పందన

తమన్ స్పందన

బన్నీ పదిహేను ఏళ్ల సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ శుభాకాంక్షలు తెలియజేసాడు. తాను సంగీతం అందించిన అల్లుఅర్జున్ రెండు చిత్రాలు రేసు గుర్రం, సరైనోడుని తమన్ గుర్తు చేసుకున్నాడు.

English summary
Allu Arjun completes 15 years industry. Allu Arjun shares this with fans in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X