»   » మెగా హీరో అవార్డు దాసరికి అంకితం: ప్రేమను చాటుకున్న డీజే

మెగా హీరో అవార్డు దాసరికి అంకితం: ప్రేమను చాటుకున్న డీజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, 'ఫిల్మ్ ఫేర్ సౌత్-2017' అవార్డును దాసరి నారాయణరావుకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ కు ఈ సారి ఫిల్మ్ ఫేర్ లో క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. అయితే అల్లు అర్జున్ తీసుకున్న ఈ అవార్డును ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దర్శక రత్న దాసరి నారాయణరావుకు అంకితం ఇస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.

దాసరి గారికి అంకితమిస్తున్నా

దాసరి గారికి అంకితమిస్తున్నా

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో భాగంగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ అందుకున్న బన్నీ.. స్టేజీపై మాట్లాడారు. ‘‘ఈ అవార్డును దాసరి నారాయణరావుగారికి అంకితమిస్తున్నా. ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. ఈ రోజు మనలోని చాలా మంది ఇక్కడ ఉన్నామంటే అది ఆయన చలవే. రెండు నిముషాల పాటు ఆయన కోసం మనమంతా మౌనం పాటిద్దాం'' అని కోరారు బన్నీ.

అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్

అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్

ఫిలింఫేర్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ను సరైనోడు చిత్రంలో నటనకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ మీద మాట్లాడిన బన్నీ.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''నన్ను వరించిన ఈ అవార్డును దాసరి నారాయణరావు గారికి అంకితమిస్తున్నాను.

ఎంతోమందికి ఆయనే ప్రేరణ

ఎంతోమందికి ఆయనే ప్రేరణ

ఇక్కడ ఉన్న ఎంతోమందికి ఆయనే ప్రేరణ. ఈరోజు మనలో చాలామంది ఇక్కడ కూర్చున్నాం అంటే.. దానికి కూడా ఆయనే రీజన్. రెండు నిమిషాల పాటు అందరూ నుంచొని ఆయన కోసం మౌనం పాటించవల్సిందిగా కోరుతున్నాను'' అంటూ సెలవిచ్చాడు. దానితో ఫిలింఫేర్ అవార్డుల ప్రాంగణం దాసరి కోసం మౌనం పాటించింది. తన అవార్డును అంకితమిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశాడు ఈ స్టయిలిష్ హీరో.

రామ్ చరణ్

రామ్ చరణ్

బ్రతికున్నప్పుడు ఎన్నెన్ని డిఫరెన్సులు అయినా ఉండొచ్చు కాని.. ఇప్పుడు ఆయన మరణించారు కాబట్టి.. ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే అంటున్నారు మెగా హీరోలు. మొన్న కాదలి సినిమా ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ అందరినీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించమన్నాడు.

మౌనంలో నిలబెట్టాడు

మౌనంలో నిలబెట్టాడు

దివంగత లెజండరీ డైరక్టర్ దాసరి నారాయణరావు గారి జ్ఞాపకార్దం అలా చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే రూటును ఫాలో అయ్యాడు. ఏకంగా ఫిలింఫేర్ ఈవెంటునే మౌనంలో నిలబెట్టాడు. మధ్యలో ఎన్నివివాదాలూ, విభేదాలూ ఉన్నా దాసరి ని శత్రువుగా భావించిన వాళ్ళే ఆయనని గౌరవించారు.. ఇక మెగా ఫ్యామిలీ విషయం లో అయితే పైకి ఎంతో దూరం ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు మెగా కాంపౌండ్ మొత్తం ఆయనకి ఇస్తున్న గౌరవం మెచ్చుకోదగ్గదే

English summary
Allu Arjun declared that he is dedicating this award to great director Dasari Narayana Rao, who passed away recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu