అల్లు అర్జున్ పై అది రూమర్ కాదు...నిజమే

దాన్ని రూమర్ అని కొట్టిపారేసారు. కెప్టెన్ కుర్చీలో కూర్చొని 'స్టార్ట్ కెమెరా యాక్షన్...' అని అల్లు అర్జున్ అనటం అబద్దం అన్నారు. అయితే అది నిజమే
అని తేలింది. ఈ విషయాన్ని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి స్వయంగా మీడియాకు తెలియచేసారు. తన తాజా చిత్రం రేయ్ ప్రమోషన్ లో భాగంగా
దాన్ని వాడుకుంటున్నారు.
అయితే అల్లు అర్జున్ డైరక్షన్ సినిమా మొత్తానికి కాదు... ఓ షాట్‌కి మాత్రమే! వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రేయ్'. సాయిధరమ్‌తేజ్
కథానాయకుడు. ఈ చిత్రంతోనే బన్నీ దర్శకత్వ ముచ్చట తీర్చుకొన్నారు. ఈ సినిమాలోని అతి కీలకమైన ఓ షాట్... అల్లు అర్జున్ నేతృత్వంలో
తెరకెక్కింది. 'రేయ్' పాటల్ని వచ్చే నెల మొదటివారంలో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ విషయం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''అవును... ఈ సినిమాలో ఓ షాట్‌కి అల్లు అర్జున్ దర్శకత్వం వహించారు. బన్నీ నాకు 'డాడీ' సినిమా
నుంచీ తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం కూడా. అతనిలోని ఎనర్జీ చూస్తే ముచ్చటేస్తుంది. 'దేవదాస్' సినిమాకి తన చేతుల మీదుగానే నేను స్క్రిప్టు
అందుకొన్నా. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.
ఓరోజు 'ఇద్దరమ్మాయిలతో', 'రేయ్' షూటింగులు ఒకే చోట జరుగుతున్నాయి. 'రేయ్'కోసం ఓ పాట తెరకెక్కిస్తున్నాం. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే పాట
అది. ఆ పాట నిడివి ఎనిమిది నిమిషాలకు పైనే. ఈ పాట కోసం దాదాపు 33 రోజులు శ్రమించాం. అందులోని ఓ కీలకమైన షాట్‌ని బన్నీ చేతుల మీదుగా
తెరకెక్కించాం. ఆ ప్రభావమో ఏమో.. అల్లు అర్జున్ ఎనర్జీ ఆ పాటలోనూ కనిపిస్తుంది'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











