»   » అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘర్షణ, ధర్నా....

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘర్షణ, ధర్నా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సందడి చేయడం మామూలే. అయితే కర్నూలులో ఈ వ్యవహారం ఘర్షణకు, ధర్నాకు దారి తీసింది.

కర్నూలులో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో...మరో స్టార్ మూవీ రన్ అవుతోంది. అయితే అప్పటికే మరో స్టార్ ఫ్లెక్సీలతో థియేటర్ నిండి పోయింది. దీంతో కొన్ని ఫ్లెక్సీలు తొలగించాలని అల్లు అర్జున్ అభిమానులు కోరారు. దీంతో రెండు వర్గాల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం, వాగ్వివాదం చోటు చేసుకుంది. బన్నీ ఫ్యాన్స్ తమ హీరోకు అన్యాయం జరుగుతోందంటూ ధర్నా చేసారు. రంగంలోకి పోలీసులు దిగి పరిస్థితి అదుపు చేయాల్సి వచ్చింది.

Allu Arjun fans stage dharna at kurnool

ఈ రోజు విడుదైలైన సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించాడు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు అదుర్స్ అంటున్నారు. ఇక సినిమాకు హైలెట్ క్లైమాక్స్ అని అంటున్నారు. అయితే సరైన ప్లేసింగ్ లేని సాంగులు సినిమా ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. కానీ పాటల చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమా కథ చాలా బావుందనే అభిప్రాయం ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. అయితే బన్నీని ఇప్పటి వరకు ఎనర్జిటిక్ గా చూసిన ప్రేక్షకులకు ఇందులోని స్లో స్క్రీన్ ప్లే అతనికి సెట్ కాలేదనే భావన కలుగింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా బన్నీ అదరగొట్టాడు. దేవిశ్రీ తన సంగీతం ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Regarding the Flexi issue, Allu Arjun fans stage dharna at kurnool.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu