»   »  డీజే లుక్ లీక్ : అల్లు అర్జున్ కి మొదటి దెబ్బ పడింది, జాగ్రత్త అవసరం

డీజే లుక్ లీక్ : అల్లు అర్జున్ కి మొదటి దెబ్బ పడింది, జాగ్రత్త అవసరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ కి పట్టిన లీకేజ్ భూతం ఇంకా వదల్లేదు. కోట్ల ఖర్చుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన విశేషాలు అఫీషియల్ రిలీజ్ కన్నా ముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. యూనిట్ సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు వీరుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. బాహుబలి సీన్ల లీకేజ్ ని మర్చిపోకముందే, గౌతమీ పుత్ర శాతకర్ణి లో బాలయ్య లుక్ కూడా ఇలాగే లీక్ అయ్యింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఈ సమస్య ఎదురైంది. బన్నీ తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేయగా ఒక రోజు ముందే బన్నీ లుక్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Allu Arjun First Look Leaked Before Release from DJ

సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడు. అర్జున్ ఈ సినిమాలో అదుర్స్ లో ఎన్టీఆర్ తరహా క్యారెక్టర్ లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. కానీ అప్పటికే లుక్ ఇలా బయటికి వచ్చేసింది మరి.

English summary
Various rumors have been heard about Allu Arjun First Look In DJ, but now we get clarity on it. Yesterday, a poster from the shooting spot featuring Bunny in Brahmin avatar went viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu