»   » బన్నీ వాయిస్ ఓవర్, చరణ్ బహద్దూర్ కోసమట

బన్నీ వాయిస్ ఓవర్, చరణ్ బహద్దూర్ కోసమట

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సినిమాలకి వాయిస్ ఓవర్ అవసరమవుతూ ఉంటుంది. పాత్రలను పరిచయం చేయడానికి .. వేగవంతంగా అసలు సన్నివేశంలోకి వెళ్లవలసినప్పుడు వాయిస్ ఓవర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ వాయిస్ ఓవర్ ను స్టార్ హీరోల చేత చెప్పిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు.

జల్సా కోసం మహేష్ బాబు

జల్సా కోసం మహేష్ బాబు

అప్పట్లో పవన్ సినిమా జల్సా కోసం మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ మంచి ప్లస్ అయ్యింది. దాంతో ఇలా స్టార్ హీరోల వాయిస్ ఓవర్ ఒక ట్రెండ్ అయ్యింది. అడపాదదపా జు. ఎన్టీఆర్ కూడా ఇలా ట్రై చేసినా తన వాయిస్ ఓవర్ తో వచ్చిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయన్న సెంటిమెంట్ తో తర్వాత ఆపేసాడట.

బహద్దూర్

బహద్దూర్

త్వరలో చరణ్ మూవీకి బన్నీ వాయిస్ ఓవర్ చెప్పనున్నాడనేది తాజా సమాచారం. చరణ్ కథానాయకుడిగా ఒక భారీ సినిమాను తెరకెక్కించడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నాడు. కన్నడలో హిట్ అయిన బహద్దూర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారట.

చరణ్ హీరోగా రీమేక్

చరణ్ హీరోగా రీమేక్

పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను చరణ్ హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాకు అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ అందిస్తాడని టాక్.కన్నడలో బహద్ధూర్ సినిమాకు పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు. అది సినిమాకు చాలా ప్లస్ అయింది.

 తెలుగులో బన్నీ

తెలుగులో బన్నీ

అదే వాయిస్ ను తెలుగులో బన్నీ చేత చెప్పించాలని చూస్తున్నారట. నిజానికి తెలుగులో ఈ తరహా ప్రయోగాలు చాలానే జరిగాయి. ఎంతోమంది స్టార్ హీరోలు, ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ చెప్పారు. కాకపోతే బన్నీ మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. మరి ఈసారి బన్నీ వాయిస్ చరణ్ కి ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి. స్క్రీన్ పై కలిసి కనిపించపోయినా.. మరోసారి రామ్ చరణ్- అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తడం ఖాయం.

English summary
Now, as per the latest update, Allu Arjun will be giving voice to his friend and cousin Ram Charan's film. it's not for Sukumar's movie but, a Kannada'Bahaddur' remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu