»   » మహేష్ బాబు తర్వాత అల్లు అర్జునే..!

మహేష్ బాబు తర్వాత అల్లు అర్జునే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా టాప్ ప్లేసులో కొనసాగుతూ....మరో వైపు పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ బాబు స్థాయిని అందుకునేందుకు పోటాపోటీగా దూసుకొస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య చాలా పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు స్టార్లలో సోషల్ నెట్వర్కింగులో అత్యధిక పాలోవర్స్ ఉన్న హీరో మహేష్ బాబు. తాజాగా అల్లు అర్జున్ కూడా సోషల్ నెట్వర్కింగు వెబ్ సైటు ఫేస్ బుక్‌లో 1 మిలియన్(10 లక్షలు) ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబుతో పాటు పోటాపోటీగా పలు కార్పొరేట్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.

అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్న బ్రాండ్లలో 7అప్, కోల్గేట్ టూత్ పేస్ట్, జోయాలుకాస్, లాట్ మొబైల్స్ మొదలైనవి ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ రోజు(అక్టోబర్ 30) నిజామాబాద్‌లో జోయాలుకాస్ కొత్త బ్రాంచిని ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తర్వాత ఆ స్థానాన్ని అందుకునేది అల్లు అర్జునే అనేది ఇండస్ట్రీ నిపుణుల వాదన.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Allu Arjun going like Race Gurram. Allu Arjun always claimed to be associating with the brands that suits his personality as he feels they were just an extension of his brand equity. He is very choosey while signing the brands and makes sure he caters time for films, ads and family based on the priority.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu