»   » అల్లు అర్జున్ తికమక.. ఆ విషయంలో స్టైలీష్ స్టార్ గందరగోళం

అల్లు అర్జున్ తికమక.. ఆ విషయంలో స్టైలీష్ స్టార్ గందరగోళం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun Has No Films On Hand అల్లు అర్జున్ తికమక.. |

డ్యాన్సులు, డైలాగ్ పంచ్ లతో తెలుగు ప్రేక్షకులనే కాదు దక్షిణాదిలోని ఇతర భాష ప్రేక్షకులకు ఊరుతలూగించే నటుడు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. దువ్వాడ జగన్నాథం (డీజే) తర్వాత ప్రముఖ మాటల రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం తాలుకు పనులు శరవేగంతో చకచకా జరుగుతున్నాయి. సదరు చిత్రం విడుదల తెదీని ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రం పూర్తి కావడానికి మరో మూడు లేదా నాలుగు నెలల సమయం పడుతుందని సమాచారం.

ఆచీ తూచీ అడుగులు..

ఆచీ తూచీ అడుగులు..

తాను నటించే సినిమాలు ఒప్పుకోవడంలో ఆచీ తూచీ అడుగులు వేసే అల్లు అర్జున్... ఈ చిత్రం తర్వాత ఏ చిత్రంలో నటించేందుకు ఒప్పుకో లేదట. గతంలో కూడా సరైనోడు చిత్ర నిర్మాణ సమయంలో కూడా అల్లు అర్జున్ ఇదే పరిస్థితి నెలకొందట.

లింగుస్వామితో...

లింగుస్వామితో...

అయితే గతంలో అల్లు అర్జున్ తో ప్రముఖ దర్శకుడు లింగుస్వామి భేటీ అయ్యారు. వారిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతుందని... సదరు చిత్రంలో నటించేందుకు అర్జున్ కూడా సై అన్నట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు వద్ద ఉన్న సమాచారం. అయితే సదరు దర్శకుడు హీరో విశాల్ తో పందెం కోడి 2 ను తెరకెక్కించే పనులతో యమ బీజిగా ఉన్నాడని తెలిసింది. దీంతో ఆ చిత్రం పూర్తి కావాలి... ఆ తర్వాత అయన దర్శకత్వంలో అల్లు అర్జున్ పని చేయాలి. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

బాబీతో వర్క్ అవుట్ అవుతుందా...

బాబీతో వర్క్ అవుట్ అవుతుందా...

అల్లు అర్జున్ తో ఇటీవలే జైలవ కుశ దర్శకుడు బాబీ భేటీ అయ్యారు. వారిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏమైనా తెరకెక్కుతుందనే అంశం మాత్రం బయటకు రాలేదు. కానీ జూనియర్ ఏన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించిన జై లవకుశ. ఆ చిత్రానికి బాబీ దర్శకుడు. సదరు చిత్రం విడుదలై... విజయవంతం అయిన తర్వాత వారి కాంబినేషన్ లో చిత్రం వచ్చే అవకాశం లేకపోలేదు.

సందీప్ రెడ్డి వంగాతో...

సందీప్ రెడ్డి వంగాతో...

ఇటీవలే టాలీవుడ్ లో విడుదలై విజయవంతమైన చిత్రాల దర్శకులు చందు మెండెటి, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లు సమాచారం. అయితే బన్నీ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆ తర్వాత ఏ దర్శకుడుతో పని చేసి.. మరింత మంచి సినిమాలో నటించేందుకు ఇప్పటికే అల్లు అర్జున్.. వ్యూహా రచన చేస్తున్నట్లు సమాచారం.

సరైన హిట్ కోసం

సరైన హిట్ కోసం

ఈ పరిస్థితులను జగ్రత్తగా గమనిస్తే వచ్చే ఏడాదికి సంబంధించి సరైన ప్లాన్ అల్లు అర్జున్ వద్ద లేనట్లు కనిపిస్తుంది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులే స్టైలిష్ స్టార్ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. సరైన హిట్ కొట్టడం కోసం... అల్లు అర్జున్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
Soon, Allu Arjun will complete the shooting of "Naa Peru Surya Naa Illu India". The film is being directed by Vakkantam Vamsi. Though a release date hasn't been finalized as yet, the film will be complete within three to four months. And once the film is wrapped up, Bunny has no films on hand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu