»   » అపురూపమైన ఫొటో: తాత తో అల్లు అర్జున్

అపురూపమైన ఫొటో: తాత తో అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారికి తన మనవడు అల్లు అర్జున్ అంటే విపరీతమైన ఇష్టం. ఆయన చివరి రోజుల దాకా నటిస్తూనే ఉన్నారు. ఆయన తన మనవడు రెండో చిత్రం ఆర్య షూటింగ్ కు వచ్చారు. అక్కడ వేణు మాధవ్ కూడా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సమయంలో ఆయన రెగ్యులర్ గా సెట్ కు తన మనవడు కోసం వచ్చేవారు. ఇదిగో అలాంటి ఓ సందర్బంలో తీసిను ఫొటో ఇది. తాత,మనవడులు ఇద్దరూ ఏదో జోక్ వేసుకుని నవ్వుకుంటున్నారు. ఈ అపురూపమైన ఫొటో మీ కోసం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే...

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో.. కన్నడ నటుడు ఉపేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

https://www.facebook.com/TeluguFilmibeat

తాజాగా, ఈ చిత్ర ఆడియోని మార్చి 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘జులాయి'తో అదిరిపోయే పాటలను అందించిన దేవీశ్రీ ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్‌ అందించాడని చిత్రబృందం అంటున్నారు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి' మ్యూజికల్‌ హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు. ఈ చిత్రం మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ ‘‘బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌తో సినిమా రూపొందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌ అభినయం సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌. త్వరలో పాటలను విడుదల చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

సింధు తులాని, వెన్నెల కిశోర్‌, బ్రహ్మానందం, రావు రమేశ్‌, ఎమ్మెస్‌ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి. ప్రసాద్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్‌.

English summary
A rare photo of Allu Ramalingaiah and his grand son Allu Arjun sharing a funny moment during the shooting of ‘Arya’.
Please Wait while comments are loading...