»   » అల్లు అర్జున్ సరసన కన్నడ అమ్మాయినే ఫైనల్

అల్లు అర్జున్ సరసన కన్నడ అమ్మాయినే ఫైనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం కోసం హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి.ఐద్రిత రే అనే కన్నడ అమ్మాయిని సెలెక్టు చేసినట్లు సమాచారం.ఆమె ప్రస్తుతం లవ్ ఇన్ హైదరబాద్ అనే చిన్న చిత్రంలో చేస్తోంది.ఈ చిత్రంలో ఎన్నికవటంతో ఆమె జాక్ పాట్ కొట్టినట్లయింది.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సర్జరీ చేయించుకోవటానికి ఆస్ట్రైలియా లోని పెర్త్ కి నిన్న (ఆదివారం,ఆగస్టు 14, 2011)రాత్రి ప్లైయిట్ కి వెళ్లారు.అక్కడ సర్జరీ చేయించుకుని నెల రోజులు పాటు రెస్ట్ తీసుకుని ఇండియాకు తిరిగివస్తారు.

సర్జరీలకు పేరు పొందిన హాస్పటిల్ లో అపాయింట్మెంట్ తీసుకుని ఈ సర్జరీ చేయించుకుంటున్నారు.ఇక అల్లు అర్జున్ కి సర్జరీ భుజంలో చేస్తారని తెలుస్తోంది. సుకుమార్ తో చేసిన ఆర్య 2 సమయంలో జరిగిన ప్రమాదంలో భుజంకు దెబ్బ తగిలింది.అప్పుడు ఇమ్మిడియిట్ గా చికిత్స చేయించుకున్నా ప్లాబ్లమ్ పూర్తిగా సాల్వ్ కాలేదు.బద్రీనాధ్ లో ప్లోర్ సాంగ్ చిత్రీకరణ సమయంలో మళ్ళీ నెప్పి తిరగబెట్టింది.దాంతో డాక్టర్స్ ఆస్టేలియాకు సజెస్టు చేసారు.భార్య స్నేహా రెడ్డిని తీసుకుని ఆయన బయిలు దేరుతున్నారు.ఇక ఈ ప్రయాణంతో త్రివిక్రమ్ సినిమా మరో నెలకు వాయిదా పడింది.డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం అక్టోబర్ లో సెట్స్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

English summary
Aindrita Ray, a kannada heroine is selected by director Trivikram in audition and is going to do her debut in telugu with Allu Arjun's Honey which is going to be directed by Trivikram Srinivas. She is also doing Love in Hyderabad which is a small budget movie. She is doing as second female role in Honey.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu