»   » ధాంక్స్ చెప్పిన అల్లు అర్జున్‌,ఎవరికి, ఎందుకు

ధాంక్స్ చెప్పిన అల్లు అర్జున్‌,ఎవరికి, ఎందుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా ఉంది. తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం కూడా కేరళలో విడుదలై విజయం సాధించింది. కేరళ వాసులు అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటారు.

కేరళనుంచి వెళ్లి దుబాయ్‌లో స్థిరపడినవారు ఇటీవల అల్లు అర్జున్‌ను 'ప్రవాసి రత్న పురస్కారంతో' సత్కరించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు. చాలా గౌరవంగా భావించినట్లు ట్వీట్‌ చేశారు.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులో చేసిన 'సరైనోడు' సినిమాను, ఆ తరువాత కేరళలోను రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ 8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 'సరైనోడు'తో ఆయన క్రేజ్ అక్కడ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి 'స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్' 'ప్రవాసి రత్న' పురస్కారాన్ని అందజేశారు. 'ఓనం' పండుగ సందర్భంగా దుబాయ్ లోని మలయాళీలు అక్కడి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో, నిన్న సాయంత్రం 'పూనోనం -2016' అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Allu Arjun Honoured with PRAVASI RATNA PURASKARAM

మన తెలుగులో మాటీవీ వారు 'మా' సినీ అవార్డ్స్ నిర్వహించినట్లే... మళయాల 24 గంటల ఎంటర్టెన్మెంట్ ఛానల్ 'ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్' వారు ఓ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్‌ను 'ప్రవాసి రత్న' అవార్డుతో సత్కరించారు.

ఏసియా నెట్ ఛానల్ వ్యూవర్ షిప్ ప్రపంచ వ్యాప్తంగా 10మిలియన్ రీచ్ అయిన సందర్బంగా 'పొన్నోనమ్-2016' పేరుతో గల్ఫ్ దేశాల్లో నివస్తిస్తున్న ప్రవాస మళయాలీల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 19న సాయంత్రం 7 గంటలకు దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ వేడుక జరుగింది.

English summary
Allu Arjun has been honoured with “Pravasi Ratna Puraskaram”(PRP) by the Popular Malayalam TV channel Asianet .The award has been received by the Allu Arjun in Dubai by the Malayalees for his hard work and dedication.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu